Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Mark Boucher: పవర్ ప్లేలో భువీ మా గాలి తీసేశాడు.. మార్క్రామ్ ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండేది

Mark Boucher Praised Bhuvi Bowling in Powerplays, and said Team Effected due to Markram Absense

దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ భారత సీమర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ ప్రదర్శన చాలా 'ప్రత్యేకమైనది' అని పేర్కొన్నాడు. ఈ సిరీస్లో దక్షిణాఫ్రికా చివర్లో వెనకబడ్డానికి కారణాల్లో ఐడెన్ మార్క్‌రామ్ గైర్హాజరీ ఒకటని పేర్కొన్నాడు. అతను ఐదు టీ20లకు అందుబాటులో ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని అతను పేర్కొన్నాడు.

ఇకపోతే ప్రస్తుతం వైట్-బాల్ క్రికెట్ మాత్రమే ఆడుతున్న భువనేశ్వర్ కుమార్.. దక్షిణాఫ్రికాతో సిరీస్లో తన మునుపటి ఫామ్ అందిపుచ్చుకున్నాడు. అతను నాలుగు మ్యాచ్‌లలో 6 వికెట్లు తీశాడు. అలాగే ఓవర్‌కు 6 పరుగుల ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అతను ఈ సిరీస్లో 14ఓవర్లు వేసి కేవలం 85పరుగులు మాత్రమే ఇచ్చాడు.

ఇక మార్క్ బౌచర్ మాట్లాడుతూ.. 'మేము నాణ్యమైన బౌలింగ్‌‌ను ప్రతిఘటించాల్సి వచ్చింది. ఇక ఈ మొత్తం సిరీస్‌లో భువీ స్పెషల్ బౌలింగ్ ఎటాక్‌తో ఆకట్టుకున్నాడు. అతను పవర్‌ప్లేలలో మా బ్యాటర్లను ఒత్తిడికి గురి చేసేలా బౌలింగ్ చేశాడు. ఇక మా బ్యాటర్లు తొలి మ్యాచ్‌లో మినహా మేము మంచి ఆరంభాలను పొందలేదు.

పవర్ ప్లేలో ఇండియా ప్లేయర్ బౌలింగ్, బ్యాటింగ్లో మాపై ఆధిపత్యం చెలాయించారు. ఇక ఈ సిరీస్లో తొలుత దక్షిణాఫ్రికా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ.. చివరి రెండు మ్యాచ్‌లలో ఓడడంతో సిరీస్ 2-2తో సమమైంది. ఇక చివరి మ్యాచ్ రద్దయిన అనంతరం బౌచర్ చెప్పాడు.

మార్క్రామ్ మిస్సవడం గురించి మాట్లాడుతూ.. 'ఈ సిరీస్ ప్రారంభంలో కరోనా కారణంగా మేము మా తుది జట్టులో మార్క్రామ్‌ను కోల్పోవడం చాలా పెద్ద ప్రభావాన్ని చూపింది. మేము మొదటి గేమ్‌ను ప్రారంభించక ముందే ఐడెన్ మార్క్రామ్ జట్టుకు దూరమయ్యాడు. ఐడెన్ మార్క్రామ్ ఉండుంటే మేమే ఆరుగురు స్పెషలిస్టు బ్యాటర్లతో బరిలోకి దిగేవాళ్లం.

కానీ మేము ఆ పని చేయలేకపోయాం' అని బౌచర్ తెలిపాడు. ఇక సుదీర్ఘ టైం ఐపీఎల్ ఆడిన తమ దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కొందరు అలసిపోయారని అది తుది ఫలితంపై ప్రభావం చూపిందని పేర్కొన్నాడు. తాము తమ అత్యుత్తమ క్రికెట్ ఆడలేదని, జట్టులోని కొందరు ప్లేయర్లు ఐపీఎల్ ఆడి మళ్లీ సరైన విరామం దొరకకుండా భారత్‌కు తిరిగి రావడంతో కాస్త ఇబ్బంది పడ్డారని బౌచర్ తెలిపాడు.

Story first published: Monday, June 20, 2022, 14:03 [IST]
Other articles published on Jun 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+