For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సహచర ఆటగాడిపై అసభ్య పదజాలం.. స్టార్ క్రికెటర్‌కు భారీ జరిమానా!!

Marcus Stoinis Fined For Homophobic Remark During BBL Match

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ స్టార్ క్రికెటర్‌, ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) భారీ జరిమానా విధించింది. బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌)లో దూకుడుగా ప్రవర్తించిన కారణంగా అతనికి 7,500 డాలర్ల జరిమానా విధిస్తూ సీఏ నిర్ణయం తీసుకుంది. తన ప్రవర్తనపై ఎటువంటి చాలెంజ్‌కు వెళ్లకుండా ఒప్పుకోవడంతో.. స్టోయినిస్‌కు జరిమానాతో సరిపెట్టింది సీఏ.

రిచర్డ్‌సన్‌పై అసభ్య పదజాలం

రిచర్డ్‌సన్‌పై అసభ్య పదజాలం

ఆస్ట్రేలియా దేశవాలి టీ20 బిగ్‌బాష్‌ లీగ్‌లో మార్కస్‌ స్టొయినిస్‌ మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు ఆడుతున్నాడు. స్టార్స్‌కు కెప్టెన్‌ కూడా. లీగ్‌లో భాగంగా మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో శనివారం మెల్‌బోర్న్‌ స్టార్స్‌, రినిగేడ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. మ్యాచ్‌ మధ్యలో స్టొయినిస్‌ తన సహచర ఆటగాడు కేన్‌ రిచర్డ్‌సన్‌పై అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో ఆటగాడిగా ప్రవర్తన నియమావళి ఉల్లగించినందుకు గాను కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కింద స్టొయినిస్‌కు 7500 ఆస్ట్రేలియన్‌ డాలర్లను జరిమానా విధించింది సీఏ.

 నేను తప్పు చేశా:

నేను తప్పు చేశా:

.'ఆ క్షణంలో ఏమైందో నాకు తెలీదు. నేను దూషించిన మాట వాస్తవం. నేను తప్పు చేసాను అనే సంగతిని వెంటనే తెలుసుకున్నా. రిచర్డ్‌సన్‌తో అసభ్యంగా ప్రవర్తించినం‍దుకు మైదానంలోనే అంపైర్ల ముందు అతనికి క్షమాపణ చెప్పా. నేను ఎందుకలా ప్రవర్తించానో నాకు మాత్రమే తెలుసు. క్రికెట్‌ ఆస్ట్రేలియా నాకు వేసిన జరిమానాను అంగీకరిస్తున్నా' అని మార్కస్‌ స్టొయినిస్‌ పేర్కొన్నాడు.

స్టార్స్‌ ఘన విజయం

స్టార్స్‌ ఘన విజయం

ఈ మ్యాచ్‌లో స్టోయినిస్‌ జట్టు మెల్‌బోర్న్‌ స్టార్స్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెనిగేడ్స్‌ 143 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా.. స్టార్స్‌ 18.5 ఓవర్లలో ఛేదించింది. స్టోయినిస్‌ (68 నాటౌట్‌) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (40)లు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

లీగ్‌ టాప్‌ స్కోరర్లలో స్టొయినిస్‌

లీగ్‌ టాప్‌ స్కోరర్లలో స్టొయినిస్‌

బిగ్‌బాష్‌ లీగ్‌లో ఈ ఏడాది స్టొయినిస్‌ అద్భుత ఆటతో 281 పరుగులు చేసి లీగ్‌ టాప్‌ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు. అయినా జనవరిలో భారత్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. మరోవైపు కేన్‌ రిచర్డ్‌సన్‌ మాత్రం ఆ సిరీస్‌కు ఎంపిక కావడం విశేషం.

పాటిన్సన్‌పై కూడా

పాటిన్సన్‌పై కూడా

ఇటీవలే ఆసీస్ ఫాస్ట్‌ బౌలర్‌ జేమ్స్‌ పాటిన్సన్‌ విక్టోరియా తరపున మ్యాచ్‌ ఆడుతూ.. ఇదే తరహాలో తీవ్ర అసభ్యపదజాలంతో దూషించడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఒక మ్యాచ్‌ సస్పెన్షన్‌తో పాటు భారీ జరిమానాను విధించింది. దీంతో నవంబర్‌లో పాక్‌తో జరిగిన హోమ్‌ సిరీస్‌లో పాటిన్సన్‌ మొదటి టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. 2018లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడినప్పటి నుంచి క్రికెట్‌ ఆస్ట్రేలియా తప్పు చేసిన ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటుంది.

Story first published: Monday, January 6, 2020, 8:40 [IST]
Other articles published on Jan 6, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+