

హైదరాబాద్: షార్జా వేదికగా శుక్రవారం ఆస్ట్రేలియా-పాకిస్ధాన్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఇద్దరు ఆస్ట్రేలియా క్రికెటర్ల ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ చేధనలో ఉన్న సమయంలో ఆ జట్టు ఆటగాళ్లు మార్కస్ స్టోయినిస్, ఆడం జంపాలు గేలు మాదిరి ప్రవర్తించారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
వివరాల్లోకి వెళితే.... ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది. అనంతరం ఆసీస్ ఛేదన చేస్తుండగా మార్కస్ స్టోయినిస్-ఆడమ్ జంపాలు ఇద్దరూ డ్రెస్సింగ్‌రూమ్ బాల్కనీలో ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. ఆ సమయంలో వీరిద్దరూ గేలుగా ప్రవర్తించారు.
ఇదంతా కూడా అక్కడి కెమెరాలో నమోదైంది. తొలుత ఆస్ట్రేలియా బౌలర్ జంపా.. మార్కస్ స్టోయినిస్ తలపై చేతి పెట్టి మృదువుగా నిమిరాడు. ఆ తర్వాత మళ్లీ తన చేతితో స్టోయినిస్ చెంప, చెవిపై నిమురుతుండగా జంపా చేతిని స్టోయినిస్ ముద్దాడినట్లు వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 281 పరుగుల విజయ లక్ష్యంతో బరిగిన ఆస్ట్రేలియా జట్టులో ఆరోన్ ఫించ్ సెంచరీతో ఆకట్టుకోగా షాన్ మార్ష్ 91 పరుగులతో నిలిచాడు. సిరీస్‌లో మొదటి బోణీ చేసి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే జరగనుంది.