For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'టెస్టు క్రికెట్‌కు సరిపోతామా లేదో తెలియదనే సందేహాం నాలో వచ్చింది'

 Marcus Harris in Perth: the return of the prodigal son

హైదరాబాద్: తన అరంగేట్రం టెస్టులో ఎక్కువ పరుగులు చేయనందుకు బాధలేదని ఆస్ట్రేలియా ఓపెనర్ మార్కస్‌ హ్యారిస్‌ అన్నాడు. పటిష్టమైన భారత‌ బౌలింగ్‌ పరుగులు చేసేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్

సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్

దీంతో ఈ సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మార్కస్‌ హ్యారిస్‌ మాట్లాడుతూ "వ్యక్తిగా మనపై మనకు సందేహాలు వస్తుంటాయి. టెస్టు క్రికెట్‌కు సరిపోతామా లేదో తెలియదు. అయితే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కాస్త సమయం తీసుకున్నందుకు సంతోషంగా ఉంది" అని చెప్పాడు.

 తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్

తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్

భారత్ బౌలింగ్‌ తేలిగ్గా లేదని, వారు అవకాశాలు ఇవ్వడం లేదని వెంటనే అర్థమైందని హ్యారిస్ పేర్కొన్నాడు. అడిలైడ్ టెస్టులో హ్యారిస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్‌, రెండో ఇన్నింగ్స్‌లో మహమ్మద్ షమి పెవిలియన్‌కు చేర్చారు. దీంతో పెర్త్‌ టెస్టులో వీరిద్దరిని ఎదుర్కోవడంపై అతడు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పుకొచ్చాడు.

అశ్విన్‌ను ఎదుర్కోవడంపై దృష్టి

అశ్విన్‌ను ఎదుర్కోవడంపై దృష్టి

'తొలి ఇన్నింగ్స్‌, రెండో ఇన్నింగ్స్‌ మధ్యలో అశ్విన్‌ను ఎదుర్కోవడంపై కొన్ని ప్రణాళికలపై దృష్టి సారించా. భారత్ నాపై ప్రయోగించే అస్త్రాలకు సన్నద్ధమయ్యా. క్రీజులో ఎక్కువ సేపు నిలవడం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మేం కేవలం 31 పరుగులు తేడాతో వెనకబడ్డాం. తొలి టెస్టులో గెలుపు దిశగా చేరువయ్యాం" అని అన్నాడు.

దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద

దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద

బ్యాట్స్‌మన్‌గా 60 లేదా 70 పరుగులు చేయాలనుకున్నానని, తొలి టెస్టులో మా బౌలర్లు బాగా బౌలింగ్‌ చేశారని హ్యారిస్‌ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌ టోర్నీ షెఫీల్డ్‌ షీల్డ్‌లో ఎక్కువ పరుగులు చేయడంతో ప్రస్తుతం టీమిండియాతో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో హ్యారిస్‌కు చోటు లభించింది.

Story first published: Thursday, December 13, 2018, 14:03 [IST]
Other articles published on Dec 13, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+