Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జేన్సన్ ఊచకోత.. సన్‌రైజర్స్ ఘన విజయం (Video)

సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20)లో ఢిఫెండింగ్ ఛాంపియన్ సన్‌‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుస విజయాలతో సత్తాచాటుతోంది. శుక్రవారం పార్ల్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో ఘనంగా నెగ్గింది. ఆల్‌రౌండర్ మార్కో జేన్సన్ (71*; 31 బంతుల్లో) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అంతేగాక రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరిన సన్‌రైజర్స్ ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో టాప్-2తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 208 పరుగులు చేసింది. అయితే ఆదిలోనే సన్‌రైజర్స్‌ వికెట్ కోల్పోయింది. మూడో ఓవర్‌లో డేవిడ్ మలన్ (2; 8 బంతుల్లో) ఔటయ్యాడు. మరో ఓపెనర్ జోర్డాన్ హెర్మన్ (36; 37 బంతుల్లో) కూడా స్లో ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు చెలరేగారు.

Marco Jansen Massacre innings helps Sunrisers Eastern Cape big win against Paarl Royals

వన్‌డౌన్‌లో వచ్చిన అబెల్ (46; 25 బంతులీ్లో) తృటిలో అర్ధశతకం చేజార్చుకున్నాడు. నాలుగో స్థానంలో వచ్చిన జేన్సన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆఖరి వరకు క్రీజులో నిలిచి నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. వికెట్‌కీపర్ స్టబ్స్ (22*; 10 బంతుల్ల) బ్యాటు ఝుళిపించడంతో సన్‌రైజర్స్ 200 మార్క్‌ను దాటింది. రాయల్స్ బౌలర్లలో ఎవన్ జోన్స్ నాలుగు ఓవర్లలో 51 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం ఛేదనలో పార్ల్ రాయల్స్ 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 164 పరుగులే చేసింది. అయితే రాయల్స్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు జేసన్ రాయ్ (32; 23 బంతుల్లో), జాస్ బట్లర్ (64; 45 బంతుల్లో) రాణించడంతో పవర్‌ప్లేలో 63 పరుగులు వచ్చాయి.

ఎనిమిదో ఓవర్‌లో రాయ్ ఔటవ్వడంతో 68 పరుగుల వీరిద్దరి భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం బాదే బాధ్యతను బట్లర్ కొనసాగించాడు. ఈ క్రమంలో అర్ధశతకం సాధించాడు. కానీ బెయెర్స్ బౌలింగ్‌లో అతడు ఔటైన తర్వా త మ్యాచ్ సన్‌రైజర్స్ వైపు తిరిగింది. కేప్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ విజయం సాధించారు. డాసన్, జేన్సన్, బెయెర్స్ తలో రెండు వికెట్లు తీశారు.

Story first published: Saturday, February 3, 2024, 8:44 [IST]
Other articles published on Feb 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+