Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'హార్దిక్ నీకు చేతకాదు.. కెప్టెన్సీ పగ్గాలు రోహిత్‌కు ఇచ్చేయ్!'

ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టు వరుస పరాజయాలతో సతమతమవుతోంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసిన ముంబై ఇండియన్స్.. పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉంది. గురువారం పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఘోరంగా ఓడిపోవడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం మార్చి 29న కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టుపై మాత్రమే ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.

హార్దిక్ కెప్టెన్సీపై విమర్శలు
ముంబై ఇండియన్స్ వైఫల్యాలపై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఘాటుగా స్పందించారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఆశించిన స్థాయిలో లేదని.. జట్టును ముందుండి నడిపించడంలో హార్దిక్ విఫలమవుతున్నాడని విమర్శించారు. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై జట్టు 2013 నుంచి 2023 మధ్య 5 ట్రోఫీలను గెలుచుకుందని గుర్తు చేసిన మనోజ్ తివారీ.. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడం ద్వారా ఫ్రాంచైజీ పెద్ద అన్యాయం చేసిందని అభిప్రాయపడ్డారు.

Manoj Tiwary Urges Hardik Pandya to Hand Over MI Captaincy to Rohit Sharma After Series of Losses

రోహిత్‌కు సారధ్య బాధ్యతలు అప్పగించాలి..
"హార్దిక్ పాండ్యా తనంతట తానుగా కెప్టెన్సీ బాధ్యతల నుంటి తప్పుకుని, తిరిగి రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించాలి" అని మనోజ్ తివారీ సూచించారు. గత రెండేళ్లుగా ముంబైకి ట్రోఫీ రాలేదని.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ ఏడాది కూడా అదే పునరావృతమయ్యేలా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జట్టులో ఐకమత్యం లోపించిందని, కెప్టెన్ నిర్ణయాలు సరిగ్గా లేవని ఆయన కుండబద్దలు కొట్టారు.

తప్పుడు వ్యూహాలు:
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ తీసుకున్న నిర్ణయాలను మనోజ్ తివారీ తప్పుబట్టారు. విధ్వంసకర బ్యాటర్ షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్‌ను కాదని, హార్దిక్ తనను తాను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు ప్రమోట్ చేసుకోవడం వల్ల జట్టు నష్టపోయిందని విమర్శించారు. అలాగే జస్ప్రీత్ బుమ్రాతో మొదటి ఓవర్ వేయించకపోవడం.. ఫామ్‌లో లేని దీపక్ చాహర్‌కు బంతిని ఇవ్వడం వంటి వ్యూహాత్మక లోపాలు ముంబై ఓటమికి కారణమయ్యాయని ఆయన విశ్లేషించారు.

Story first published: Friday, April 17, 2026, 16:57 [IST]
Other articles published on Apr 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+