Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'బుర్ర పని చేయట్లేదా.. ఏంటి?' - ధోనీపై మాజీ ఫ్రెండ్..!!

IPL 2025 Dhoni: ఐపీఎల్ 2025 తాజాగా జరిగిన మ్యాచులో ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ అతిపెద్ద భారీ ఓటమిని (బంతుల పరంగా) అందుకుంది. ఐదు సార్లు టైటిల్ ఛాంపియన్ గా నిలిచిన ఆ జట్టు.. కేకేఆర్ పై నిర్ణీత 20 ఓవర్ల కేవలం 103/9 పరుగులు మాత్రమే చేసింది. దాన్ని కేకేఆర్ 10.1 ఓవర్లలోనే ఛేదించేసింది. ఈ సీజన్ లో ఆడిన ఆరు మ్యాచుల్లో సీఎస్కేకు ఇది వరుసగా ఐదో ఓటమి. ఐపీఎల్ చరిత్రలో వరుసగా ఐదు ఓటములు అందుకోవడం సీఎస్కేకు ఇదే తొలి సారి. అలానే సొంతగడ్డ చెపాక్ స్టేడియంలోనూ వరుసగా మూడు ఓటములు అందుకోవడం ఇదే మొదటి సారి. తద్వారా పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.

అయితే ఈ ఓటమి తర్వాత ధోనీ మాజీ టీమ్ మేట్ మనోజ్ తీవారీ కొన్ని ప్రశ్నలు సంధించాడు. గత నాలుగు మ్యాచుల్లో ఆటగాళ్ల ఆటతీరు, నిర్ణయాల్లో లోపాలు కనిపిస్తున్నాయని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్ నూర్ అహ్మద్‌ను ఆలస్యంగా బౌలింగ్‌కు పంపడం, అశ్విన్‌ తన వ్యూహాన్ని మార్చి బౌలింగ్ చేయడం, పైగా ధోనీ లాంటి అనుభవజ్ఞుడు ఆటగాడు ఉన్నప్పుడు ఇటువంటి తప్పిదాలు జరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

ఈ సారి ఎందుకు జరిగిందో?
"ఇక్కడి నుంచే CSK పతనం ప్రారంభమవుతోందని అనిపిస్తోంది. గత మూడు నాలుగు మ్యాచ్‌లను గమనిస్తే.. వాళ్ల ఆటతీరు అస్సలు బాగోలేదు. ఆటగాళ్ల షాట్ సెలెక్షన్ చూస్తే.. 20-25 ఏళ్ల అనుభవం ఉన్న ఆటగాళ్లకు తర్వాత ఏం జరగబోతుందో తెలిసిపోతుంది. నాకు కొన్ని విషయాలు అర్థం కాలేదు. పర్పుల్ క్యాప్ విజేత నూర్ అహ్మద్‌ను ఎనిమిదో ఓవర్‌లోనే బౌలింగ్‌కు పంపారు. అతడు మొదటి బంతికే సునీల్ నరైన్ వికెట్ తీస్తే, మరి అతడిని ముందుగానే ఎందుకు పంపలేదో అర్థం కావడం లేదు. ధోనీ సాధారణంగా ఇలాంటి తప్పిదాలు చేయడు. ఇన్నేళ్లలో అతడ తప్పిదాలు చేసినట్లు నేనెప్పుడు చూడలేదు. మరి ఈసారి ఎందుకు జరిగిందో"

ముందే చేయొచ్చు కదా - మెదడు పనిచేయట్లేదా?
"ఓటమి తర్వాతే వ్యూహాల్ని ఎందుకు మార్చాలి? ముందే ప్లాన్ చేయొచ్చు కదా? అశ్విన్‌ అంతకుముందు లెఫ్ట్ హ్యాండర్స్‌కు రౌండ్ ది స్టంప్ బౌలింగ్ చేశాడు. కానీ ఈసారి ఓవర్ ది స్టంప్ వేశాడు. ఇది నరైన్‌కు కలిసొచ్చింది. ఇవన్నీ చిన్న విషయాలే అయినప్పటికీ.. ధోనీ లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు ఉంటే ఇ లాంటివి జరగకూడదు కదా. కొంపతీసి వాళ్ల మెడదు పని చేయడం ఆగిపోయిందా" అని మనోజ్ తివారీ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

Manoj Tiwary says Dhoni brain stopped working loss after by KKR ipl 2025
Story first published: Saturday, April 12, 2025, 13:24 [IST]
Other articles published on Apr 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+