బౌలర్లు విఫలం: డబుల్ సెంచరీతో అలరించిన మనోజ్
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఏ డివిజన్ వన్డే లీగ్‌లో శాంతి ఎలెవన్ బ్యాట్స్‌మన్ మనోజ్ కుమార్ చెలరేగి పోయాడు. 114 బంతులను ఎదుర్కొన్న మనోజ్ కుమార్ 28 ఫోర్లు, 7 సిక్సులతో అజేయంగా 210 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
దీంతో యూనివర్సల్ సీసీతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 299 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళితే తొలుత బ్యాటింగ్ చేసిన శాంతి ఎలెవన్ జట్టు 40 ఓవర్లలో 4 వికెట్లను నష్టపోయి 362 పరుగుల భారీ స్కోరు చేసింది.

శాంతి ఎలెవన్ జట్టులో మనోజ్ కుమార్ అజేయంగా డబుల్ సెంచరీతో రాణించడంతో యూనివర్సల్ సీసీ జట్టు బౌలర్లు అతడిని కట్టడి చేయడంతో విఫలమయ్యారు. యూనివర్సల్ సీసీ బౌలర్లపై మనోజ్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. మనోజ్ తర్వాత సుమంత్ (60), కిరణ్ (41) ఆకట్టుకున్నారు.
అనంతరం 363 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన యూనివర్సల్ సీసీ జట్టు 40 ఓవర్లలో 63 పరుగులకు ఆలౌటైంది. శాంతి ఎలెవన్ బౌలర్లలో రాహుల్ రెడ్డి 5 వికెట్లతో చెలరేగిపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications