Mankading in TNPL: నా ప్రవర్తన క్షమించరానిది.. తీవ్ర భావోద్వేగంతో సారీ చెబుతూ లేఖ రాసిన జగదీశన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రతి సంవత్సరం తమిళనాడు ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ జరుగుతుందనే విషయం తెలిసిందే. ఈ సారి కూడా ఈ లీగ్ రసవత్తరంగా ఆరంభమైంది. ఈ లీగ్ తొలి మ్యాచ్‌లోనే ఓ వివాదం ఏర్పడింది. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉండే బ్యాటర్‌ను ఔట్ చేసేందుకు బౌలర్ అత్యంత అరుదుగా ప్రయోగించే మన్కడింగ్ వివాదం మళ్లీ ఈ మ్యాచ్ ద్వారా అగ్గి రాజేసింది. చెపక్ సూపర్ గిల్లీస్ బ్యాటర్ ఎన్. జగదీశన్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉండగా.. బాబా అపరాజిత్ బౌలింగ్ చేస్తూ.. క్రీజ్ నుంచి కొద్దిగా బయటికి వచ్చిన జగదీశన్‌ను మన్కడింగ్ విధానంలో రనౌట్ చేశాడు. ఇక అవుటై పెవిలియన్‌కు వెళ్తున్న జగదీశన్ తీవ్ర అసహనంతో కనిపించాడు. వెళ్తూ, వెళ్తూ అతను మిడిల్ ఫింగర్‌ను చూపించుకుంటూ వెళ్లాడు. దీంతో అతని మీద నెగెటివ్ కామెంట్లు జోరందుకున్నాయి. క్రికెట్ ఆటలో ఇలాంటి మిస్ బిహేవియర్ పనికిరాదని అతనికి పెద్దఎత్తున హితవులొచ్చాయి.

నేను చేసింది ముమ్మాటికీ తప్పే
ఇక ఈ విషయమై జగదీశన్ స్పందించాడు. 'నిన్నటి మ్యాచ్‌లో నేను క్షమించరాని విధంగా ప్రవర్తించాను. మీ అందరికీ నా ప్రగాఢ క్షమాపణలు చెబుతున్నాను. నా జీవితం క్రికెట్ కోసమే. క్రికెట్‌ను మాత్రమే కాకుండా క్రీడాస్ఫూర్తిని కూడా నేను ఎంతో గౌరవిస్తాను. అందుకే నేనేంటి ఇలా రియాక్ట్ అయ్యానేంటి అంటూ నన్ను నేను నమ్మలేకపోతున్నాను. నాకు చాలా బాధగా ఉంది. ఏ క్రీడల్లోనైనా రాణించడంతో పాటు.. ఆటలో భావోద్వేగాలను నియంత్రించుకోవడం, సరైన మార్గంలో మన నడవడిని కనబర్చడం చాలా ముఖ్యం. ఆ టైంలో వచ్చిన నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడంలో నేను పూర్తిగా విఫలమయ్యాను. ఇక నేను చేసింది ముమ్మాటికి తప్పే. దాన్ని సమర్థించుకునేందుకు నా దగ్గర ఎలాంటి సాకులు లేవు. నేను ఇకనుంచి మంచి క్రీడాస్ఫూర్తితో ఆడతాను.' అంటూ జగదీశన్ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు.

అసలేం జరిగిందంటే..
ఇకపోతే ఈ మ్యాచ్‌లో చెపక్ సూపర్ గిల్లీస్ వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ జగదీశన్ 15బంతుల్లో 25పరుగులతో మంచి జోరు మీదున్నాడు. ఇక అతన్ని బౌలర్ బాబా అపరాజిత్ ఔట్ చేయడానికి మన్కడింగ్ విధానాన్ని ఎంచుకున్నాడు. 4వ ఓవర్‌లో 25 పరుగుల వద్ద ఆడుతున్న జగదీశన్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉండగా.. బాబా అపరాజిత్ బౌలింగ్‌కు దిగాడు. క్రీజ్ నుంచి కొద్దిగా బయటికి వచ్చిన జగదీశన్‌ను ఒక సెకన్ పాటు ఆగి మన్కడింగ్ విధానంలో రనౌట్ చేశాడు. ఇక అవుటై పెవిలియన్‌కు వెళ్తున్న జగదీశన్ బూతులు తిట్టుకుంటూ మిడిల్ ఫింగర్‌ను చూపించుకుంటూ డగౌట్‌కు వెళ్లాడు. ఈ సీన్లు కెమెరాలో స్పష్టంగా కన్పించాయి. దీంతో ఈ వీడియో క్లిప్‌లు నెట్టింట వైరలయ్యాయి.

తొలి మ్యాచే సూపర్ ఓవర్‌తో రసవత్తరంగా..
తమిళనాడు ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో భాగంగా తొలి మ్యాచ్ తిరునెల్వేలిలోని ఇండియా సిమెంట్స్ కంపెనీ గ్రౌండ్‌లో గురువారం జరిగింది. చెపక్ సూపర్ గిల్లీస్- నెల్లయ్ రాయల్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన నెల్లయ్ రాయల్ కింగ్స్ జట్టు సూర్యప్రకాష్ (50 బంతుల్లో 62పరుగులు), సంజయ్ యాదవ్ (47 బంతుల్లో 87 పరుగులు నాటౌట్) రాణించడంతో 184 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చెపక్ సూపర్ గిల్లీస్ కూడా 184పరుగులు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. చెపక్ తరఫున కౌశిక్ గాంధీ (62 పరుగులు), సోను యాదవ్ (34 పరుగులు), ఎస్ హరీష్ కుమార్ (12 బంతుల్లో 26పరుగులు నాటౌట్) రాణించారు. ఇక సూపర్ ఓవర్‌లో సూపర్ గిల్లీస్ తొమ్మిది పరుగులు మాత్రమే చేయడంతో.. నెల్లయ్ కింగ్స్ ఛేదించి గెలుపొందింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications