చెపాక్ సూపర్ గిల్లీస్-నెల్లయ్ రాయల్స్
తమిళనాడు ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో భాగంగా తొలి మ్యాచ్ తిరునెల్వేలిలోని ఇండియా సిమెంట్స్ కంపెనీ గ్రౌండ్‌లో గురువారం రాత్రి ప్రారంభమైంది. చెపాక్ సూపర్ గిల్లీస్- నెల్లయ్ రాయల్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో తలపడ్డాయి. టాస్ గెలిచిన చెపాక్ సూపర్ గిల్లీస్ కేప్టెన్ కౌశిక్ గాంధీ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. సూపర్ గిల్లీస్ బౌలర్లు ప్రారంభంలోనే వికెట్లు పడగొట్టాడు. నెల్లయ్ రాయల్ కింగ్స్ జట్టు 36 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది.
రసవత్తరంగా మ్యాచ్..
లక్ష్మేషా సూర్యప్రకాష్, సంజయ్ యాదవ్ ఇన్నింగ్‌ను నిర్మించారు. వీరిద్దరూ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. సూర్యప్రకాష్ 50 బంతుల్లో 62 చేశాడు. సంజయ్ యాదవ్ 47 బంతుల్లో 87 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 20 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి నెల్లయ్ రాయల్ కింగ్స్ జట్టు 184 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చెపాక్ సూపర్ గిల్లీస్ 20 ఓవర్లల్లో సరిగ్గా 184 పరుగులు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.
కేప్టెన్సీ ఇన్నింగ్..
కౌశిక్ గాంధీ కేప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు. 62 పరుగులు చేశాడు. సోను యాదవ్ 34 పరుగులు చేశాడు. చివర్లో ఎస్ హరీష్ కుమార్ భారీ షాట్లతో విరుచుకుపడటంతో మ్యాచ్ టై అయింది. 12 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో హరీష్ కుమార్ 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మ్యాచ్ టై కావడం వల్ల సూపర్ ఓవర్ ఆడక తప్పలేదు. ఈ ఓవర్‌లో సూపర్ గిల్లీస్ తలవంచింది. సూపర్ ఓవర్‌లో గిల్లీస్ ఒక వికెట్ కోల్పోయి తొమ్మిది పరుగులు చేయగా.. అయిదు బంతుల్లో ఒక వికెట్‌ను నష్టపోయి లక్ష్యాన్ని అందుకుంది నెల్లయ్ కింగ్స్ జట్టు.
మన్కడింగ్ విధానంలో
ఇదంతా ఒక ఎత్తయితే- చెపాక్ సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ నారాయణ్ జగదీశన్ మన్కడింగ్ విధానంలో అవుట్ కావడం దుమారం రేపింది. బౌలర్ బాబా అపరాజిత్.. అతణ్ని మన్కడింగ్ విధానంలో అవుట్ చేశాడు. 4వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కేప్టెన్ కౌశిక్ గాంధీ బ్యాటింగ్ చేస్తోన్నప్పుడు నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్నాడు జగదీశన్. అప్పటికి చెపాక్ సూపర్ కింగ్స్ జట్టు స్కోరు 35 పరుగులు.
మిడిల్ ఫింగర్..
బాబా అపరాజిత్ బౌలింగ్ వేస్తోన్న సమయంలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్ క్రీజ్ నుంచి కొద్దిగా బయటికి వచ్చాడు జగదీశన్. దీన్ని గమనించిన అపరాజిత్.. అతన్ని రనౌట్ చేశాడు. అప్పటికి జగదీశన్ జోరు మీద ఉన్నాడు. 15 బంతుల్లో 25 పరుగులు బాదాడు. అతణ్ని పెవిలియన్ దారి పట్టించడానికి బాబా అపరాజిత్ మన్కడింగ్ విధానాన్ని ఎంచుకున్నాడు. అవుట్ పెవిలియన్‌కు వెళ్తోన్న సమయంలో జగదీశన్ తీవ్ర అసహనంతో కనిపించాడు. ఆగ్రహావేశాలతో వెనుదిరిగాడు. వెళ్తూ, వెళ్తూ అతను మిడిల్ ఫింగర్‌ను చూపించాడు.


Click it and Unblock the Notifications












