Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెండూల్కర్ పై మంజ్రేకర్ మండిపాటు

Manjrekar
ముంబయి: సచిన్ టెండూల్కర్ పై ఆయన మాజీ జట్టు సహచరుడు సంజయ్ మంజ్రేకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టాప్ ఆర్డర్ లో టెండూల్కర్ వరుస వైఫల్యం వల్ల అంతర్జాతీయ వన్డే మ్యాచుల్లో భారత్ ను దెబ్బ తీస్తోందని ఆయన అన్నారు.

మంచి పిచ్ పై భారత్ రెండో సారి బ్యాటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ లో అత్యుత్తమ స్థానంలో బ్యాటింగ్ చేసినా ఫలితం ఉండడం లేదని ఆయన అన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు రాసిన కాలమ్ లో ఆయన సచిన్ పై విరుచుకుపడ్డారు.

టెండూల్కర్ మొదట బ్యాటింగ్ చేసినప్పుడు 24 ఇన్నింగ్సుల్లో ఆయన బ్యాటింగ్ సగటు 62.10 ఉండగా రెండో సారి బ్యాటింగ్ చేసినప్పుడు 27 ఇన్నింగ్సులో సగటు 26 మాత్రమే ఉందని మంజ్రేకర్ ఎత్తి చూపారు. టెండూల్కర్, సెహ్వాగ్ ల వరుస వైఫల్యాలను భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కూడా నిరాశ పరిచింది.

మంగళవారం శ్రీలంకతో జరిగే మ్యాచులో బ్యాటింగ్ ఆర్డరును మారుస్తానని ఆయన ఆదివారంనాడు అన్నారు. టాప్ ఆర్డర్ బాగా ఆడి ఉంటే లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ కు సిడ్నీ వన్డేలో సులభం అయి ఉండేదని ఆయన అన్నారు.
Story first published: Monday, February 25, 2008, 16:36 [IST]
Other articles published on Feb 25, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+