Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెలరేగిన పాండే: ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో ఇండియా ఏ విజయం

హైదరాబాద్: దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్ ఏ జట్టు ఫైనల్‌కు చేరింది. దక్షిణాఫ్రికా ఏతో జరిగిన మ్యాచ్‌లో భారత ఏ జట్టు వికెట్ తేడాతో విజయం సాధించింది. తద్వారా ఫైనల్‌కు అర్హత సాధించింది.

ఇండియా ఏ జట్టు కెప్టెన్ మనీశ్ పాండే 85 బంతుల్లో 93 పరుగులతో ఆజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 267 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఏ జట్టు రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది.

 Manish Pandey stars in India 'A' one-wicket victory over South Africa 'A'

కెప్టెన్ మనీశ్ పాండే చివరి వరకు క్రీజులోనే ఉన్నాడు. పాండేకు తోడుగా సంజూ శాంసన్(68) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ పర్యటనలో భారత్‌కు ఇది వరుసగా మూడో విజయం కావడం విశేషం. తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన ఇండియా ఏ జట్టు ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించింది.

225 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇండియా ఏ జట్టుని కృనాల్ పాండ్యా 3 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో ఆదుకున్నాడు. 25 బంతులను ఎదుర్కొన్న కృనాల్ పాండ్యా 35 పరుగులు చేశాడు. చివర్లో 9 బంతుల్లో 4 పరుగులు చేయాల్సిన సమయంలో పదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సిద్ధార్ద్ కౌల్ అవుట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.

అయితే మనీశ్ పాండే, 11వ బ్యాట్స్‌మెన్ మహ్మద్ సిరాజ్‌(2)తో కలిసి జట్టుని విజయ తీరాలకు చేర్చాడు. మంగళవారం దక్షిణాఫ్రికాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

సంక్షిప్త స్కోర్లు:

దక్షిణాఫ్రికా ఏ: 266 (Heinrich Klaasen 127, Willem Mulder 66, Shardul Thakur 4/35, Siddharth Kaul 3/41)
ఇండియా ఏ: 267/9 in 49.4 overs (Manish Pandey 93 not out, Sanju Samson 68, Krunal Pandya 25 not out) India 'A' won by 1 wicket.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+