Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాకు 'గోల్డెన్ లెగ్' అతడే.. ఆడిన 18 మ్యాచ్‌లలో విజయం!!

Manish Pandey Golden Leg for TeamIndia in T20 cricket

వెల్లింగ్టన్‌: టీమిండియాలో 'గోల్డెన్ లెగ్' అనే బిరుదు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఉంది. ఎందుకంటే.. ధోనీ ఏ ప్రయోగం చేసినా అది టీమిండియాకు కలిసొచ్చేది. తాజాగా ఈ తరహా ప్రశంసలు బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండేపై కురుస్తున్నాయి. ఓసారి పాండే గణాంకాలు చూస్తే మీరు కూడా ఇదే విషయాన్ని అంగీకరిస్తారు. గత రెండేళ్లలో టీ20 జట్టులో మనీశ్ పాండేకి చోటిచ్చిన ప్రతిసారీ టీమిండియానే గెలుపొందింది.

టీమిండియాకు 'గోల్డెన్ లెగ్':

టీమిండియాకు 'గోల్డెన్ లెగ్':

2018 నుంచి తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20 వరకూ భారత్ తరఫున మనీశ్ పాండే 18 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ 18 టీ20 మ్యాచ్‌లలో టీమిండియానే విజయం సాధించింది. ఈ లెక్కలు చూస్తే.. టీమిండియాకు పాండే 'గోల్డెన్ లెగ్' అనొచ్చు. ప్రస్తుతం పాండేపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. పాండే టీమిండియాకు 'గోల్డెన్ లెగ్', 'గోల్డెన్ హ్యాండ్' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'టీ20 ప్రపంచకప్‌కు పాండేను ఎంపిక చేయాలి' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

పాండే లక్కీ రికార్డ్ కొనసాగేనా?

పాండే లక్కీ రికార్డ్ కొనసాగేనా?

వెల్లింగ్టన్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో పాండే అద్భుత ఆటతో హాఫ్ సెంచరీ బాది టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌తో బే ఓవల్ వేదికగా జరిగే ఐదో టీ20లోనూ చోటు ఖాయం చేసుకున్నాడు. పాండే లక్కీ రికార్డ్ చివరి టీ20లోనూ కొనసాగాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు. న్యూజిలాండ్‌ గడ్డపై ఐదు టీ20ల సిరీస్‌ను గెలిస్తే.. కోహ్లీసేన కొత్త రికార్డును లిఖిస్తుంది. న్యూజిలాండ్‌లో ఐదు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన తొలి భారత జట్టుగా కోహ్లీ గ్యాంగ్‌ నిలుస్తుంది.

ఆరుసార్లు నాటౌట్‌:

ఆరుసార్లు నాటౌట్‌:

మరోవైపు మనీష్‌ పాండే టీ20ల్లో తన నాటౌట్‌ ప్రస్తానాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. న్యూజిలాండ్‌తో ప్రస్తుత సిరీస్‌లో ఇప్పటివరకూ ఔట్‌ కానీ పాండే.. అంతర్జాతీయ టీ20ల్లో వరుసుగా ఆరుసార్లు నాటౌట్‌గా నిలిచాడు. దీంతో నాటౌట్‌ల విషయంలో 'డబుల్‌ హ్యాట్రిక్‌' కొట్టాడు. పాండే గత ఆరు అంతర్జాతీయ మ్యాచ్‌ల స్కోర్లు (50 నాటౌట్‌, 14 నాటౌట్‌, 14 నాటౌట్‌, 31 నాటౌట్‌, 22 నాటౌట్‌, 2 నాటౌట్‌) ఇలా ఉన్నాయి.

చాయిస్‌ లేదు:

చాయిస్‌ లేదు:

నాలుగో టీ20 మ్యాచ్ అనంతరం పాండే మాట్లాడుతూ... 'చాలా సంతోషంగా ఉంది. నా ఆట తీరుపై సంతృప్తిగా ఉన్నా. నేను ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి విలువైన పరుగులు చేయడం ఆనందంగా ఉంది. జట్టులో ఇప్పుడు నాది ఆరో స్థానమనే ఫిక్స్‌ అయ్యా. ఎందుకంటే.. ముందుగా రావడానికి నాకు చాయిస్‌ లేదు. ప్రస్తుతం ఆ స్థానం కోసమే సన్నద్ధమవుతున్నాం. నేను మూడు లేదా నాల్గో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తా. అయితే ఇప్పుడు ఆ స్థానాల్లో పోటీ ఉంది. చాన్స్‌ల కోసం నిరీక్షించక తప‍్పదు' అని అన్నాడు.

Story first published: Saturday, February 1, 2020, 18:15 [IST]
Other articles published on Feb 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+