Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డిసెంబర్ 2న స్టార్ హీరోయిన్‌ను పెళ్లాడనున్న క్రికెటర్ మనీశ్ పాండే

Manish Pandey To Marry Actress Ashrita Shetty In December || Oneindia Telugu
Manish Pandey all set to enter wedlock with South Indian actress Ashrita Shetty

హైదరాబాద్: టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. డిసెంబర్ 2న ముంబైలో సినీ నటి అశ్రిత శెట్టిని పెళ్లాడనున్నాడు. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఆ విషయం తెలిసిన ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించారు.

దక్షిణాది సినీ పరిశ్రమలో అశ్రిత శెట్టి పేరు బాగా సుపరిచితమే. 26 ఏళ్ల అశ్రిత శెట్టి ఇంద్రజిత్, ఓరు కన్నియుమ్ మూను కలవానికాలమ్, ఉదహం ఎన్‌హెచ్ 4 లాంటి నటించారు. ఆర్. పన్నీర్ సెల్వం దర్శకత్వంలో రాబోయే సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోందనే ఊహాగానాలు కూడా ఉన్నాయి.

పెళ్లికి అతికొద్ది మంది మాత్రమే

పెళ్లికి అతికొద్ది మంది మాత్రమే

జాతీయ మీడియాలో వచ్చిన వార్తలు ప్రకారం మనీశ్ పాండే పెళ్లి సన్నిహితులు మరియు బంధువుల సమక్షంలో రెండు రోజులు పాటు జరగనుందని తెలుస్తోంది. పాండే పెళ్లికి టీమిండియా క్రికెటర్లు సైతం హాజరుకానున్నారు. ముంబైలో డిసెంబర్ 2న జరగబోయే మనీశ్ పాండే పెళ్లికి భారత జట్టులోని ఆటగాళ్లు పాల్గొనే అవకాశం ఉంది.

భారత క్రికెటర్లు సైతం హాజరు

భారత క్రికెటర్లు సైతం హాజరు

ఎందుకంటే అదే సమయంలో భారత క్రికెట్ జట్టు-వెస్టిండిస్ జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ జరగనుంది. ఈ సిరిస్‌లో ఒక మ్యాచ్‌కి ముంబై ఆతిథ్యమిస్తోంది. ప్రస్తుతం మనీశ్ పాండే విజయ్ హాజారే ట్రోఫీ 2019-20 సీజన్‌లో కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. పాండే విషయానికి వస్తే ఐపీఎల్‌లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్.

నిలకడలేమి కారణంగా

నిలకడలేమి కారణంగా

అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ నిలకడలేమి కారణంగా జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాపై అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన మనీశ్ పాండే తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో పాండే సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

తుది జట్టులో దక్కని చోటు

తుది జట్టులో దక్కని చోటు

అయితే, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందిన మనీశ్ పాండే జట్టులో చోటు దక్కించుకున్నా... రిజర్వ్ బెంచ్‌కే పరిమితమవుతున్నాడు. అయితే, దేశవాళీ క్రికెట్‌లో ప్రదర్శన ఆధారంగా వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత వెస్టిండిస్ పర్యటనకు అతడిని సెలక్టర్లు ఎంపిక చేసినప్పటికీ తుది జట్టులో చోటు దక్కలేదు.

భవిష్యత్తులో కీలక ఆటగాడిగా

భవిష్యత్తులో కీలక ఆటగాడిగా

పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో టీమిండియా మిడిలార్డర్‌లో మనీశ్ పాండే భవిష్యత్తులో కీలక ఆటగాడిగా ఎదిగే అవకాశం లేకపోలేదు. ఇక, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

Story first published: Thursday, October 10, 2019, 14:47 [IST]
Other articles published on Oct 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+