
మూడో నుండే క్రికెట్‌పై ఆసక్తి
రవి బిష్ణోయ్ ఇప్పుడు స్టార్ అయినా.. క్రికెట్ ఆడే మొదటి రోజులలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. రవి మూడో తరగతి చదువుతున్నప్పుడే క్రికెట్ ఆటపై ఇష్టం పెంచుకున్నాడు. ఆ ఇష్టంతో ఆడటం మొదలెట్టాడు. అప్పుడే రాజస్థాన్ జోధ్‌పూర్‌లోని క్రికెట్ అకాడమీలో చేరాడు. అయితే రవి తండ్రి మంగీలాల్ బిష్ణోయ్ క్రికెట్ ఆడొద్దని, చదువుపై దృష్టి సారించమని ఆదేశించారు. తర్వాత అతడు ఐదో తరగతిలో ఉండగా స్కూల్ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు.

క్రికెట్ ఆడొద్దని చెప్పిన తండ్రి
రవి అద్భుత ప్రదర్శన చూసిన మంగీలాల్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇక రవి ప్రదర్శన చూసిన ఓ ప్రైవేట్ క్రికెట్ అకాడమీ అతడికి స్పాన్సర్‌గా ఉండేందుకు ముందుకు వచ్చింది. అలా కెరీర్ ముందుకు సాగింది. అయితే అండర్-16 జట్టులో అవకాశం రాకపోతే మంగీలాల్ మరోసారి రవిని క్రికెట్ ఆడొద్దని చెప్పారట. రవికి శిక్షణ ఇచ్చిన ఇద్దరు కోచ్‌లు సర్దిచెప్పడంతో మంగీలాల్ క్రికెట్ ఆడేందుకు ఒప్పుకున్నారు. రవి ఎనిమిదో తరగతిలో ఉన్నప్పటి నుంచి కోచ్‌లు ప్రద్యుత్ రాథోర్, షారుఖ్ పఠాన్ మేటి స్పిన్నర్‌గా తీర్చిదిద్దారు. ఆపై అండర్-19 ప్రపంచకప్‌లో ఆకట్టుకున్నాడు.

తొలి బౌలర్‌గా చరిత్ర:
ఫైనల్ పోరులో రవి బిష్ణోయ్ నాలుగు వికెట్లు తీయడంతో అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (17) తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో షాలాభ్ శ్రీవాత్సవ (2000), అభిషేక్ శర్మ (2002), కుల్‌దీప్ యాదవ్ (2014), అంకుల్ రాయ్ (2018) 15 వికెట్లతో ముందున్నారు.

టోర్నీ టాపర్
ఈ టోర్నీలో 17 వికెట్లతో రవి మొదటి స్థానంలో ఉండగా.. కెనెడాకు చెందిన అఖిల్ కుమార్, అఫ్గాన్‌కు చెందిన షాఫికుల్లా ఘఫారీ చెరో 16 వికెట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇక అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో నాలుగు వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా మరో రికార్డు నెలకొల్పాడు. పీయుష్ చావ్లా (2006), సందీప్ శర్మ (2012) గతంలో ఈ ఘనత సాధించారు.

10 ఓవర్లు.. 4 వికెట్లు
ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిచి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్నా.. రవి బిష్ణోయ్ ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. టీమిండియా నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించవచ్చనుకున్న బంగ్లా బ్యాట్స్‌మెన్స్‌కు తన అద్భుత బౌలింగ్‌తో ముచ్చెమటలు పట్టించాడు. రవి బిష్ణోయ్ బంగ్లా టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. మొత్తం 10 ఓవర్లు బౌలింగ్ చేసిన రవి 3 ఓవర్లు మేడిన్‌గా ముగించాడు. రవి తన కోటా 10 ఓవర్లలలో 30 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసాడు.


Click it and Unblock the Notifications












