For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో రికార్డు ఛేజింగ్‌.. ఆసీస్‌పై భారత్ ఘన విజయం!!

Mandhana, Shafali shine as India chase down record total to beat Australia by 7 wickets

మెల్‌బోర్న్‌: భారత మహిళల జట్టు టీ20ల్లో రికార్డు ఛేజింగ్‌తో ఘన విజయాన్ని అందుకుంది. ముక్కోణపు టీ20 టోర్నీలో భాగంగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించారు. భారత మహిళలు సమిష్టిగా రాణించి అద్భుత విజయాన్ని అందుకున్నారు.

మెరిసిన గార్డ్‌నర్‌:

మెరిసిన గార్డ్‌నర్‌:

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. యాష్లీ గార్డ్‌నర్‌ విజృంభించి ఆడి 57 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 93 పరుగులు చేసింది. మెగ్ లానింగ్‌ 37 పరుగులతో ఫర్వాలేదనిపించింది. బెత్ మూనీ 16 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది.

చెలరేగిన షెఫాలీ:

చెలరేగిన షెఫాలీ:

లక్ష్య చేధనకు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మందాన్న, షెఫాలీ వర్మల జోడీ శుభారంభం అందించింది. తొలి వికెట్‌కి 85 పరుగులు జోడించిన తర్వాత ఎల్లీస్ పెర్రీ బౌలింగ్‌లో వర్మ (49; 18 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌) పెవిలియన్ చేరింది. వర్మ అద్భుతంగా ఆడి ఒక్క పరుగు తేడాతో అర్ధ సెంచరీ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన జమిమా రోడ్రిక్స్ 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అలీసా హేలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది.

మందాన్న అర్ధ సెంచరీ:

మందాన్న అర్ధ సెంచరీ:

ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నా స్మృతి మందాన్న మాత్రం పట్టు వదలకుండా బ్యాటింగ్ చేసింది. కీలక సమయంలో బ్యాట్ జులిపించి (55; 48 బంతుల్లో 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించింది. మందాన్న ఔట్ అయినా.. దీప్తి శర్మ (11), హర్మన్ ప్రీత్ కౌర్‌ (20) నాటౌట్‌గా నిలిచారు. ఫలితంగా భారత్ 19.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. భారత మహిళల జట్టుకు టీ20ల్లో ఇదే అతిపెద్ద ఛేజింగ్‌ కావడం విశేషం.

సిరీస్ ఆశలు సజీవం:

సిరీస్ ఆశలు సజీవం:

ముక్కోణపు టీ20 టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు రెండు గెలిచి, రెండు ఓడింది. 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. దీంతో సిరీస్ ఆశలు సజీవం చేసుకుంది. ఇక మూడు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచిన ఇంగ్లండ్‌ అగ్రస్థానంలో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతోంది.

Story first published: Saturday, February 8, 2020, 12:41 [IST]
Other articles published on Feb 8, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+