Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గాయం నుంచి కోలుకోని హర్మన్‌ప్రీత్: టీ20 కెప్టెన్‌గా స్మృతి మంధాన

Mandhana to lead India women in T20Is against England, Harmanpreet yet to recover from ankle injury

హైదరాబాద్: ఇంగ్లాండ్ మహిళల జట్టుతో జరగబోయే మూడు టీ20ల సిరిస్‌కు ఓపెనర్ స్మతి మంధాన కెప్టెన్‌గా వ్వవహారించనుంది. ఈ మేరకు 15మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. పాదం గాయంతో బాధపడుతున్న కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఈ సిరిస్‌కూ దూరమైంది.

ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రస్తుతం జరుగుతున్న మూడు వన్డేల సిరిస్‌కు కూడా హర్మన్‌ప్రీత్‌ దూరమైన సంగతి తెలిసిందే. దీంతో మూడు టీ20ల సిరిస్‌కు ఓపెనర్‌ స్మృతీ మంధాన తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించనుంది.

టీ20 సిరిస్‌లో భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ కూడా చోటు దక్కించుకుంది. మూడు వన్డేల సిరిస్‌లో తొలి రెండు వన్డేల్లో టీమిండియా నెగ్గడంతో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరిస్‌ను భారత్ కైవసం చేసుకుంది. కాగా, టీ20 సిరిస్ మార్చి 4, 7, 9 తేదీల్లో గువాహటిలో జరుగుతాయి.

ఇంగ్లాండ్‌తో టీ20 సిరిస్‌కు భారతజట్టు:
స్మృతీ మంధాన (కెప్టెన్‌), మిథాలీ రాజ్‌, జెమీమా రోడ్రిగ్స్‌, దీప్తి శర్మ, తానియా భాటియా (వికెట్‌ కీపర్‌), భారతీ ఫుల్మాలీ, అనూ జా పాటిల్‌, శిఖా పాండే, కోమల్‌ జన్జడ్‌, అరుంధతీ రెడ్డి, పూనమ్‌ యాదవ్‌, ఏక్తా బిస్త్‌, రాధా యాదవ్‌, వేదా కృష్ణమూర్తి, హర్లీన్‌ డియోల్‌.

Story first published: Tuesday, February 26, 2019, 9:31 [IST]
Other articles published on Feb 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+