Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'షెఫాలీ ఆది నుంచే విధ్వంసం సృష్టిస్తుంది.. నాలానే పరుగులు సాధిస్తోంది'

Mandhana doesnt mind sharing limelight with Shafali, says youngster takes pressure off her

మెల్‌బోర్న్: భారత మహిళా యువ ఓపెనర్‌ షెఫాలీ వర్మను స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ప్రశంసించింది. షెఫాలీ వర్మ తనలానే పరుగులు చేస్తోందని, ఆమె జట్టును బలోపేతం చేస్తుందన్నారు. మహిళల టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్‌ 'ఎ'లో ఇప్పటిదాకా ఎదురులేని భారత జట్టు గురువారం జరిగే పోరులో న్యూజిలాండ్‌తో తలపడనుంది. గత రెండు మ్యాచ్‌ల్లో మన అమ్మాయిలు ఇటు బ్యాటింగ్‌లోనూ, అటు బౌలింగ్‌లోనూ అదరగొట్టారు. ముఖ్యంగా 16 ఏళ్ల టీనేజ్‌ సంచలనం షఫాలీ వర్మ మెరుపుదాడి చేస్తోంది.

న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా స్మృతి మంధాన మాట్లాడుతూ... 'గత రెండు మూడేళ్లుగా ఎన్నో పరుగులు చేశాను. ముఖ్యంగా పవర్‌ప్లేలో ఎంతో దూకుడుగా ఆడాను. అయితే షెఫాలీ వర్మ నాలానే పరుగులు చేస్తోంది. ఆమె జట్టును బలోపేతం చేస్తుంది. టీ20ల్లో సానుకూల ధోరణితో బ్యాటింగ్‌కు వస్తూ.. ఆది నుంచే విధ్వంసం సృష్టిస్తుంది. ఆమె జట్టును ఎంతగానో ప్రభావితం చేస్తూ సమతూకంగా మారుస్తోంది' అని అన్నారు.

'ప్రత్యర్థులకు ఎంత లక్ష్యాన్ని నిర్దేశించాలనే ఆలోచనతో బరిలోకి దిగం. కానీ.. బ్యాటర్లందరూ మెరుగైన ప్రదర్శన చేయడానికే ప్రయత్నిస్తాం' అని మంధాన పేర్కొన్నారు. ప్రపంచకప్‌లో షెఫాలీ తొలి రెండు మ్యాచ్‌ల్లో చెలరేగిన సంగతి తెలిసిందే. ఆసీస్‌పై 15 బంతుల్లో 29 పరుగులు.. బంగ్లాదేశ్‌పై 17 బంతుల్లో 39 పరుగులు చేసింది. దీనిలో 5 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. ఈ మెగాటోర్నీలో 212 స్ట్రైక్‌రేటుతో షెఫాలీ బ్యాటింగ్ చేస్తుంది.

ఈ రోజు జరగనున్న మ్యాచ్‌లో షెఫాలీ వర్మని కట్టడిచేసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నానని న్యూజిలాండ్ పేసర్‌ లీ తాహుహు పేర్కొంది. 'షెపాలీ వర్మతో టీ20లు ఆడాను. దూకుడుగా ఆడటంలో ఆమె అసలు వెనకడుగు వేయదని నాకు తెలుసు. ఆమెకి బౌలింగ్ చేయడం కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నా. ఆమెను కట్టడిచేయడానికి ప్రయత్నిస్తా' అని చెప్పుకొచ్చారు.

Story first published: Thursday, February 27, 2020, 8:30 [IST]
Other articles published on Feb 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+