For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముస్తాక్ అలీ ట్రోఫీ: పంజాబ్ గెలిచి చూపించింది

Mandeep powers Punjab win via Super Over

హైదరాబాద్: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ సూపర్‌ లీగ్‌ గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో భాగంగా కర్ణాటక జట్టుపై పంజాబ్‌ జట్టు ఉత్కంఠకర విజయం సాధించింది. పంజాబ్ జట్టు సూపర్‌ ఓవర్‌ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.

జట్టు సారథి సీఎం గౌతమ్‌ (36), అనిరుధ్‌ (40 నాటౌట్‌; 19 బంతుల్లో) రాణించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 7 వికెట్లు నష్టపోయి 158 పరుగులే చేసింది. మన్‌దీప్‌సింగ్‌ (45), సారథి హర్భజన్‌ (33), యువరాజ్‌ (29) రాణించారు. రెండు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్‌ ఓవర్‌ ఆడించారు.

సూపర్‌ ఓవర్‌లో ఉత్కంఠ:
సూపర్‌ ఓవర్‌లో పంజాబ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. మన్‌దీప్‌ (10; 4 బంతుల్లో 1×6), యువరాజ్‌ (5; 2 బంతుల్లో 1×4) 250 స్ట్రైక్‌రేట్‌తో 15 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటకను పంజాబ్‌ బౌలర్‌ సిద్ధార్థ్‌ కౌల్‌ 11 పరుగులకే పరిమితం చేశాడు. ఒక వికెట్‌ తీశాడు. కరుణ్‌నాయర్‌ (8; 5 బంతుల్లో 1×4), అనిరుధ్‌ (2; 2 బంతుల్లో) కర్ణాటకకు విజయం అందించలేకపోయారు.

అయితే జనవరి 27, 28తేదీల్లో జరగనున్న ఐపీఎల్ వేలానికి యువరాజ్, మన్‌దీప్ లు వారి కొనుగోలు ధరను ప్రకటించారు. మన్‌దీప్ కొనుగోలు ధర రూ. 50 లక్షలుగా ఉంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 22, 2018, 10:56 [IST]
Other articles published on Jan 22, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+