
మాంచెస్టర్: టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన వెంటనే ఆయన అభిమానులతో సెల్ఫీ దిగారు. ఆయనతో సెల్ఫీ దిగిన అభిమానులందరూ ఆ సమయంలో నీలం రంగు జెర్సీలను ధరించడం విరాట్ కోహ్లీని ఆశ్చర్యానికి గురి చేసింది. దీన్ని ప్రతిబింబించేలా ఆయన ఓ ట్వీట్ చేశారు. ఐ డోన్ట్ నో అబౌట్ ఫుట్‌బాల్.. బట్ మాంచెస్టర్ వాజ్ బ్లూ టుడే. కాన్ఫరెన్సివ్ విక్టరీ.. అనే క్యాప్షన్‌ను దానికి యాడ్ చేశారు. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
మాంచెస్టర్‌లో ఫుట్‌బాల్‌కు క్రేజ్ ఎక్కువ. మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ పేరుతో ఓ టీమ్ కూడా ఉంది. క్రికెట్ కంటే కూడా ఫుట్‌బాల్ మ్యాచ్‌లను చూడ్డానికే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు బ్రిటీషర్లు. వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా ఫుట్‌బాల్ మ్యాచ్ తరహాలో క్రేజ్ ఏర్పడిందని విరాట్ కోహ్లీ చెబుతున్నారు. వేల సంఖ్యలో అభిమానులు నీలరంగు జెర్సీలను ధరించి, స్టేడియానికి వచ్చారని, తమకు మద్దతుగా నిలిచారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. విండీస్ జరిగిన మ్యాచ్‌లో ఓ సమగ్ర విజయాన్ని అందుకున్నామని అంటూ ఈ ట్వీట్ వదిలారు.