లీగల్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమై
పృథ్వీకి వస్తోన్న ప్రశంసల్లో భాగంగా శుభాకాంక్షలు తెలిపిన వారితో పాటు అతని క్రేజ్‌ను వాడుకున్న ప్రముఖ వాణిజ్య సంస్థలపై పృథ్వీ షా తరపు మేనేజర్‌లు లీగల్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైయ్యారు. ఈ క్రమంలో బేస్ లైన్‌ను మొబైల్ ఆధారిత వాణిజ్య యాప్ స్విగ్గీ.. ఆన్‌లైన్ రీఛార్జింగ్ యాప్ ఫ్రీ ఛార్జిలకు పంపారు. వాటితో పాటుగా అమూల్ పృథ్వీ షా యానిమేషన్ పిక్చర్ ఒకటి వాడుకుని షా బాష్ అనే ట్యాగ్ లైన్ వాడుకుని వ్యాపారం ప్రచారం చేసుకుంటుందని తెలుసుకుని దానిపైనా చర్యలు తీసుకోనున్నారు.
సాధించేందుకు ఎన్ని కష్టాలు పడ్డాడో
ఈ క్రమంలో దీనిని వాడడం వల్లే టీనేజర్ ఇంతటి బలాన్ని సొంతం చేసుకున్నాడంటూ మార్కెటింగ్ చేసుకోవడం మొదలుపెట్టాయి. ఈ విషయం తెలుసుకున్న మేనేజర్లు 'మాకు కొద్ది సమాచారం తెలిసింది. ఇంకెన్ని సంస్థలు ఇలా మోసం చేస్తున్నాయో తెలుసుకుని అన్నింటికీ లీగల్ నోటీసులు పంపుతాం. షా ఇంతటి క్రేజ్ సంపాదించుకునేందుకు.. అంతటి ప్రతిభ సాధించేందుకు ఎన్ని కష్టాలు పడ్డాడో మాకు తెలుసు. అలా కాకుండా తమ వల్లే జరిగిందంటూ వారు ప్రచారం చేసుకోవడం ముమ్మాటికీ తప్పేనంటూ షా తరపు మేనేజర్లు వాదిస్తున్నారు.

నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా నోటీసులు
ఈ క్రమంలోనే స్విగ్గీ, ఫ్రీ ఛార్జిలపై కోటి రూపాయల వరకూ నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా నోటీసులు పంపారట. న్యాయబద్ధంగా మాతో కలిసి ప్రయాణిస్తోన్న స్పాన్సర్లను మోసం చేయకూడదు. ప్రొటినెక్స్, ఇండియన్ ఆయిల్‌లకు మాత్రమే పృథ్వీ షా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. వారికి అన్ని రకాలుగా వాడుకునేందుకు హక్కు ఉంది. కానీ, ఏ సంబంధంలేని బ్రాండ్లు 'పృథ్వీ కా ఫేవరేట్' అంటూ వాడుకోగలరు. ఇలాంటి మార్కెటింగ్ టాక్టిక్స్ వాడిన వాళ్లందరూ శిక్షార్హులే.

స్విగ్గీ ముందుకొచ్చి చెప్పినట్లు
నోటీసులు తమకు అందాయని.. స్విగ్గీ ముందుకొచ్చి చెప్పినట్లు ఎకానమిక్ టైమ్స్ అనే మీడియా పేర్కొంది. ఏదో పొరబాటు జరగడం వల్ల జరిగిందని ఒప్పుకోవడం లేదు. పృథ్వీ తరపు మేనేజర్లతో ఒప్పందం కుదుర్చుకునేందుకు తమ లీగల్ బృందం ఏర్పాట్లు చేస్తుందంటూ స్విగ్గీ మేనేజ్‌మెంట్ తెలిపింది.


Click it and Unblock the Notifications

