Jasprit Bumrah: బుమ్రా భార్య అందంగా లేదంటూ ట్రోల్.. ఆమె ముఖం పగిలేలా ఇచ్చిందిగా.,!

ప్రస్తుతం టీమిండియా ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడుతోంది. ఇంగ్లండ్‌తో సెమీస్ ఆడుతోంది. అడిలైడ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా భార్య, స్టార్ క్రికెట్ యాంకర్ సంజనా గణేశన్ ఈ మ్యాచ్‌కు ముందు అడిలైడ్‌లో వాతావరణం బాగుందని తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసింది. దీన్ని చాలా మంది క్రికెట్ అభిమానులు లైక్ చేశారు. కానీ ట్రోలర్లకు వేరే పని ఉండదు కదా.. ఈ ఫొటోపై కూడా విపరీతంగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

ఇన్‌స్టా పోస్టుపై ట్రోలింగ్..
ఎర్రడ్రెస్ వేసుకొని అడిలైడ్ స్టేడియంలో సంజన నిలబడి ఫొటో దిగింది. ఈ ఫొటోను 'అడిలైడ్‌లో ప్రస్తుతం వాతావరణం బ్యూటిఫుల్‌గా ఉంది' అని పోస్టు చేసింది. దీన్ని చూసిన చాలా మంది నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఫొటోలో ఎలాంటి పొరపాటు కానీ, తప్పుకానీ లేదు. అయినా ట్రోలర్లకు కారణం కావాలా? దీనిపై కూడా ట్రోలింగ్ చేశారు. 'నువ్వు అంత అందగత్తెవు కాదు. మరి బుమ్రాను ఎలా పడేశావ్?' అని ఒక వ్యక్తి అడిగాడు.

చెంప చెళ్లుమనేలా సమాధానం..
సాధారణంగా ట్రోలర్లు సంజనకు దూరంగా ఉంటారు. ఎందుకంటే ఆమె వాళ్లకు చెంప ఛెళ్లుమనిపించేలా సమాధానాలు ఇస్తుంటుంది. తన అందంపై ట్రోల్ చేసిన వ్యక్తికి కూడా ఇదే జరిగింది. 'నువ్వు చెప్పులాంటి మొఖంతో తిరుగుతున్నావ్ కదా. మరి దాని సంగతేంటి?' అని రిప్లై ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు నవ్వుకోలేక చస్తున్నారు. ఆమె సమాధానం గురించి తెలిసిన తర్వాతనే పోస్టు చూస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు.

మోడల్ యాంకర్..
చాలాకాలంగా స్పోర్ట్స్ యాంకర్‌గా ఉన్న సంజన.. ఐపీఎల్ వంటి టోర్నీలను కూడా హోస్ట్ చేస్తుంటుంది. అంతకుముందు 2014లో మిస్ ఇండియా పీజెంట్ పోటీల్లో పాల్గొంది. ఆ తర్వాత కొంతకాలం మోడల్‌గా పనిచేసి, అనంతరం రియాలిటీ షో యాంకర్‌గా కెరీర్ ఎంచుకుంది. ఇది జరిగిన కొంతకాలానికి టీమిండియా పేస్ గుర్రం బుమ్రా, ఆమె కలిశారు. వీళ్లిద్దరూ గతేడాది పెళ్లితో ఒక్కటయ్యారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications