Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ కొడుక్కి మలింగ స్పెషల్ ట్రైనింగ్..RCB మ్యాచ్‌లో ఎంట్రీ (Video)

ఐపీఎల్-2024 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని విధంగా ఫలితాలు వస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ టాప్‌-3లో నిలిచాయి. మరోవైపు స్ట్రాంగ్ టీమ్స్ అయిన ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ అట్టడుగన నిలిచింది.

అయితే షెడ్యూల్ భాగంగా రేపు వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌-ఆర్సీబీ తలపడనుంది. ఈ సీజన్‌లో అయిదు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు, నాలుగు మ్యాచ్‌లు ఆడిన ముంబై ఒకే విజయం సాధించాయి. దీంతో ప్లేఆఫ్స్‌కు తమ అవకాశాలు మెరుగుపర్చుకోవాలంటే ఇరు జట్లు తప్పక గెలుపుబాట పట్టాల్సిందే. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.

Malinga Provides Exclusive Training to Sachin s Son Arjun Tendulkar

మరోవైపు ముంబై ఇండియన్స్ తమ ఆటగాళ్లతో కఠోర సాధన చేయిస్తోంది. బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టడం విశేషం. ఒక్క స్టంప్‌కు గురి చూసి బంతులు సంధించేలా శిక్షణ ఇస్తున్నాడు. అర్జున్‌తో పాటు కొందరు యువ ఆటగాళ్లతో బౌలింగ్ ప్రాక్టీస్ చేయించాడు. అయితే వాళ్లెవరూ వికెట్‌కు గురిపెట్టలేకపోయారు.

కానీ బంతి అందకున్నలసిత్ మలింగ వికెట్‌ను సునాయసంగా పడగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది నెట్టింట వైరల్‌‌గా మారింది. 40 ఏళ్ల వయసులోనూ మలింగ లక్ష్యం మిస్ అవ్వట్లేదని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ సీజన్‌లో ఆర్సీబీ మ్యాచ్‌తో అర్జున్ టెండూల్కర్‌ ఎంట్రీ ఇస్తాడని ఆశిస్తున్నామని సచిన్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

24 ఏళ్ల ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. మూడు వికెట్లు పడగొట్టాడు. గత సీజన్‌లో కేకేఆర్‌ మ్యాచ్‌లో అర్జున్ ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ సీజన్‌లో అర్జున్‌కు ఇంకా అవకాశం దక్కలేదు. దీంతో రేపటి మ్యాచ్‌లో అతడికి ఛాన్స్ ఇవ్వాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Wednesday, April 10, 2024, 14:36 [IST]
Other articles published on Apr 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+