Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మలింగ బ్యాటింగ్ మాయ, ధోని సేనకు ఎదురుదెబ్బ...

Malinga
చెన్నై: ఆరు బంతులు 11 పరుగులు. క్రీజ్‌లో మలింగ, భజ్జీ ఇద్దరు బౌలర్లే. మొదటి బౌల్‌ భజ్జీ సింగిల్‌ తీసి మలింగకు ఇచ్చాడు. ఐదు బంతులు 10 పరుగులు. మలింగ అప్పటికే మంచి ఊపు మీదున్నాడు. రెండో బంతి మలింగ బౌండరీకి తరలించాడు. స్టేడియం లో ఒకటే ఆనందం. ముంబాయి అభిమానుల సందడి. చెనై అభిమానుల్లో నిరాశ. మూడో బంతి సింగిల్‌ తీసి భజ్జీకి ఇచ్చాడు. నాలుగో బంతి హర్భజన్‌ ఫోర్‌ కొట్టాడు. స్కోరు సమం అయింది. అంతే ముంబాయి ఇండియన్స్‌లో ఆనందం. సంతోషం. రెండు బంతులు, లక్ష్యాన్ని చేధించటానికి కేవలం ఒక పరుగు దూరం. హర్భజన్‌ సింగిల్‌ తీసి ముంబయి ఇండియన్స్‌కి మరపురాని విజయాన్ని అందించాడు.

చాంపియన్స్‌ లీగ్‌లో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో మలింగ అద్భుత బ్యాటింగ్‌తో ముంబై ఇండియన్స్‌కు మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో 106 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ముంబైకి మలింగ, హర్భజన్‌లు 53 పరుగుల అజేయ భాగస్వామ్యంతో ఒక బంతి మిగిలి ఉండగానే విజయాన్ని సాధించి పెట్టారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. తర్వాత 159 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 19.5 ఓవర్లలో 159/7 పరుగులతో మ్యాచ్‌ను గెలుచుకున్నారు.

లక్ష్యచేదనకు దిగిన ముంబై ఇండియన్స్‌లో ఓపెనర్లు జాకబ్‌ 15 బంతుల్లో 3 ఫోర్లతో 18, బ్లిజార్డ్‌ 21 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 28 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లు చెలరేగి బౌలింగ్‌ చేయడంతో తర్వాతి బ్యాట్స్‌మెన్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక పోయారు. టాప్‌ బ్యాట్స్‌మెన్లు సైమండ్స్‌ (3), రాయుడు (5), సుమన్‌ (5), పోలార్డ్‌ (22)లు త్వరత్వరగానే వెనుదిరిగారు. దీంతో ముంబై 15.2 ఓవర్లలో 106 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో వచ్చిన మలింగ, హర్బజన్‌లు మ్యాచ్‌ను మలుపు తిప్పారు. మలింగ విజృంభించి ఆడుతూ స్కోరుబోర్డును వేగంగా ముందుకు నడిపించాడు.

మలింగ ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిస్తూ బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో ముంబై ఇండియన్స్‌ చివరి ఓవర్‌లో మరో బంతి మిగిలి ఉండగానే మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన మలింగ 18 బంతుల్లోనే 3 సిక్స్‌లు, 3 ఫోర్లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇతనికి అండగా నిలిచిన హర్భజన్‌ (19) పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. అయితే హస్సీ మాత్రం వీరోచితంగా ఆడాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌లో హస్సీ ఒక్కడే నిలకడగా ఆడి స్కోరును పరుగులెత్తించాడు. కేవలం 57 బంతుల్లో 81 పరుగులు చేశాడు. దీంతో చెన్నై 20 ఓవర్లలో 158/4 పరుగులను చేయగలిగింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+