
హైదారాబాద్: యాషెస్ సిరిస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య పెర్త్‌లోని వాకా స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 89 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది.
ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా 2017 మూడో టెస్టు స్కోరు కార్డు

ప్రస్తుతం క్రీజులో దావిద్ మలన్ (110 నాటాట్), జానీ బెయిర్ స్టో (75 నాటౌట్) పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ ఓపెనర్లు చక్కటి శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. ఓపెనర్ అలెస్టర్ కుక్ (7) పరుగుల వద్ద మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన జేమ్స్ విన్స్‌తో కలిసి మరో ఓపెనర్ మార్క్ స్టోన్‌మన్ నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీని సాధించాడు. ఆ తర్వాత జట్టు స్కోరు 89 పరుగుల వద్ద జేమ్స్ విన్స్ (25) పరుగుల వద్ద జోష్ హేజెల్‌ఉడ్ బౌలింగ్‌లో టిమ పైనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
ఇక కెప్టెన్ జో రూట్ (20) పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దావిద్ మలన్ మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడినప్పటికీ ఆ తర్వాత దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. ఈ క్రమంలో తన కెరీర్‌లో తొలి టెస్టు సెంచరీని నమోదు చేశాడు.
92 పరుగుల వద్ద ఉన్నప్పుడు మిలన్‌కు లైఫ్ లభించింది. ఆ లైఫ్‌ని సద్వినియోగం చేసుకున్న మిలన్ సెంచరీతో చెలరేగాడు. తన తొలి టెస్టు సెంచరీని యోషన్‌లో నమోదు చేయడం పట్ల మిలన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీసుకోగా... జోష్ హాజెల్ ఉడ్, పాట్ కుమ్మన్స్ తలో వికెట్ తీశారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.