INDvsBAN: టెస్టుల్లోనూ చెత్త ప్రయోగం?.. పుజారాను వైస్ కెప్టెన్ చేయడం ఏంది?

టీమిండియాలో చెత్త ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్ టెస్టులో కూడా ఈ ప్రయోగాలు చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా ఉన్న రిషభ్ పంత్‌ను పక్కన పెట్టిన సెలెక్టర్లు సీనియర్ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారాను వైస్ కెప్టెన్‌గా నియమించారు. కొన్ని రోజుల క్రితం అసలు జట్టులో పుజారా చోటుపైనే ప్రశ్నలు తలెత్తాయి. అలాంటి ఆటగాడిని సడెన్‌గా వైస్ కెప్టెన్ చేయడం ఎంత వరకు సమంజసం? ఈ నిర్ణయం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి.

శ్రీలంక సిరీస్‌కు దూరం..
బంగ్లా సిరీస్‌లో వైస్ కెప్టెన్‌గా ఉన్న ఛటేశ్వర్ పుజారా.. ఆ తర్వాత జరిగే శ్రీలంక సిరీస్‌లో ఆడటం లేదు. ఒక ఏడాది క్రితం పుజారా చాలా చెత్త ఫామ్‌లో ఉన్నాడు. దీంతో జట్టులో చోటు కూడా కోల్పోయాడు. అయితే రోహిత్ శర్మ గైర్హాజరీలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో ఓపెనర్‌గా వచ్చి రాణించాడు. అంతకుముందు కౌంటీల్లో కూడా రాణించడంతో మళ్లీ జట్టులో చోటు సంపాదించాడు. అయితే పునరాగమనంలో కూడా పుజారా స్థానం పదిలమైందని ఎవరూ అనుకోవడం లేదు. అలాంటి సమయంలో పుజారాను ఇలా వైస్ కెప్టెన్ చేయడం సమంజసం కాదంటున్నారు.

బంగారం వంటి అవకాశం
టెస్టు క్రికెట్‌లో పుజారా టాప్ బ్యాటర్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ అతని వయసు 34. భవిష్యత్తులో జట్టు పగ్గాలు అందుకునే అవకాశం పుజారాకు ఏమాత్రం లేదు. అలాంటప్పుడు పుజారాను వైస్ కెప్టెన్ చేయకుండా.. పంత్ వద్దనుకుంటే మరో యువ ఆటగాడిని వైస్ కెప్టెన్ చేసుంటే అతను మెరుగైన ఆటగాడిగా ఎదిగే అవకాశం ఉంటుంది. రోహిత్ లేని సమయంలో యువకుడిని గ్రూమ్ చేసి భవిష్యత్తుకు పునాది వేసే సదవకాశం చేతుల్లోకి వచ్చింది. దాన్ని వదిలేసుకొని కెరీర్ చరమాంకంలో ఉన్న పుజారాను చేయడం ఏమాత్రం కరెక్ట్?

పంత్‌కు చేదుగా..
టెస్టు ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్‌ను టీమిండియా వైస్ కెప్టెన్ చేశారు. జట్టు లీడర్‌షిప్ గ్రూప్‌లో పంత్‌ను కూడా భాగం చేయాలని కొంత కాలంగా టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రయత్నిస్తూ వచ్చింది. దానికితోడు ఈ ఫార్మాట్‌లో భారత్ నుంచి వచ్చిన అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్‌గా మారే దిశగా పంత్ అడుగులు వేస్తున్నాడు.
అలాంటి ప్లేయర్‌ను ఇప్పుడు కాదని, పుజారాను వైస్ కెప్టెన్ చేయడం పంత్ కాన్ఫిడెన్స్‌పై ప్రభావం చూపుతుంది. ఈ చేదు విషయాన్ని అతను ఎలా తీసుకుంటాడనేది కూడా కీలకంగా మారుతుంది. ఈ ఫలితం లేని నిర్ణయం ప్రభావం పంత్ ఆటతీరుపై పడితే అది భారత జట్టుకు ఇబ్బందికరంగా మారుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications