న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నేటి పోటీ వాతావరణంలో క్రికెట్‌లో పేరు తెచ్చుకోవడం చాలా కష్టం'

Making a name in cricket is tougher now: Virender Sehwag

హైదరాబాద్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో క్రికెట్‌లో పేరు సంపాదించడం చాలా కష్టమని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఒకసారి గమనిస్తే 80, 90 దశకాల్లో చాలా మంది ఆటగాళ్లు మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబైల నుంచి వచ్చిన వారేనని, అయితే ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల నుంచి కూడా క్రికెటర్లు ఎదుగుతున్నారని సెహ్వాగ్ తెలిపాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఆల్ యాక్సెస్: ద కంటెడర్స్‌పై

ఆల్ యాక్సెస్: ద కంటెడర్స్‌పై

డిస్కవరీ చానెల్ తీసుకొస్తున్న కొత్త షో ఆల్ యాక్సెస్: ద కంటెడర్స్‌పై సెహ్వాగ్ మాట్లాడుతూ "ప్రస్తుతం చాలా మంది పిల్లలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుని ఆడుతున్నారు. దీంతో ఇప్పుడు క్రికెట్‌లో చాలా పోటీ నెలకొంది. దీంతో క్రికెట్‌లో మంచి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం" అని అన్నాడు.

ప్రతిభను నిలకడగా ప్రదర్శించడం

ప్రతిభను నిలకడగా ప్రదర్శించడం

"అయితే తమలోని ప్రతిభను నిలకడగా ప్రదర్శించడం ద్వారా క్రికెటర్‌గా ఎదగొచ్చు. ప్రతిభ కలిగిన కుర్రాళ్లు నిలకడగా రాణిస్తూ వస్తే మెరుగైన భవిష్యత్తుతో పాటు 10-12 ఏళ్లు కెరీర్ కొనసాగిస్తూ డబ్బులు సంపాదించవచ్చు. పేరున్న లీగ్‌లో స్థిరమైన ప్రదర్శన కనబరిస్తేనే జట్టులోకి ఎంపికయ్యే అవకాశముంది" అని సెహ్వాగ్ అన్నాడు.

80, 90 దశకాల్లో

80, 90 దశకాల్లో

"ప్రస్తుత తరంలో చిన్న చిన్న పట్టణాల నుంచి కుర్రాళ్లు వస్తున్నారు. శివమ్‌ దూబే (ముంబై), కమలేశ్‌ నాగర్‌కోటి (రాజస్తాన్‌), ఇషాన్‌ పొరెల్‌ (బెంగాల్‌), హార్విక్‌ దేశాయ్‌ (గుజరాత్‌), అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (పంజాబ్‌) ఇలా వెలుగులోకి వచ్చినవారే. ఒకసారి గమనిస్తే 80, 90 దశకాల్లో చాలా మంది ఆటగాళ్లు మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబైల నుంచి వచ్చిన వారే. కానీ ఇప్పుడు పరిసస్థితి మారింది" అని అన్నాడు.

భారత జట్టులో వారి ప్రాతినిధ్యం

భారత జట్టులో వారి ప్రాతినిధ్యం

దీని వల్ల భారత జట్టులో వారి ప్రాతినిధ్యం అంతకంతకు పెరుగుతోందని సెహ్వాగ్ అన్నాడు. అండర్-19 క్రికెట్‌లో రాణించిన శివమ్ దూబే, కమలేశ్ నాగర్‌కోటి, ఇషాన్ పోరెల్, హార్విక్ దేశాయ్, అన్మోల్‌ప్రీత్‌సింగ్, ప్రభ్‌సిమ్రన్‌సింగ్ క్రికెట్ నేపథ్యంపై డిస్కవరీ ఛానెల్ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తోంది.

Story first published: Saturday, April 6, 2019, 14:59 [IST]
Other articles published on Apr 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X