Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'కోహ్లీకి అండర్‌-19 నుంచే గుర్తింపు మొదలైంది.. ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు'

Makhaya Ntini said It all started from U-19 World Cup for players such as Virat Kohli


దుబాయ్: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి అండర్‌-19 ప్రపంచకప్‌ నుంచే గుర్తింపు రావడం మొదలైంది. ఇప్పుడు కోహ్లీ ఏ స్థాయిలో ఉన్నాడో అందరికి తెలిసిన విషయమే అని దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ మఖాయ ఎన్తిని అన్నాడు. యువ ఆటగాళ్ల ఎదుగుదలలో అండర్‌-19 ప్రపంచకప్‌ ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నాడు. అండర్‌-19 ప్రపంచకప్‌ జనవరి 17 నుండి ఫిబ్రవరి 9 వరకు దక్షిణాఫ్రికాలో జరుగుతుంది.
అండర్‌-19 నుంచే గుర్తింపు:

అండర్‌-19 నుంచే గుర్తింపు:

అండర్‌-19 ప్రపంచకప్‌ సందర్భంగా మఖాయ ఎన్తిని ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'విరాట్‌ కోహ్లీ, కేన్ విల్లియంసన్, కాగిసో రబాడకు అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆడటం నుంచే గుర్తింపు రావడం మొదలైంది. ఇప్పుడు వారే స్థాయిలో ఉన్నారో మనకు తెలుసు. ప్రస్తుతం స్టార్ ఆటగాళ్లలో చాలా మంది అండర్‌-19 నుంచే కెరీర్‌ ప్రారంభించారు. అక్కడి నుండి ప్రపంచం దృష్టిలో పడ్డారు' అని అన్నాడు.

 క్రికెట్‌కు చాలా ఆదరణ ఉంది:

క్రికెట్‌కు చాలా ఆదరణ ఉంది:

'దక్షిణాఫ్రికాలో క్రికెట్‌కు చాలా ఆదరణ ఉంది. అక్కడి యువత క్వింటన్ డికాక్‌, రబాడ వంటి క్రికెటర్ల గురించే ఎక్కువగా చర్చిస్తున్నారు. అందుకే త్వరలో దక్షిణాఫ్రికాలో జరిగే ప్రపంచకప్‌ యువ క్రికెటర్లకు ఎంతో కీలకం. 2018లో నా కుమారుడు థాండొను చూడటం నాకో మధుర జ్ఞాపకం. నేనూ అండర్‌-19 టోర్నీ ఆడా. అందులో లభించే అనుభవం గొప్పగా ఉంటుంది. భవిష్యత్తులో జాతీయ జట్టు ప్రాతినిధ్యం వహించేలా చేస్తుంది; అని ఎన్తిని పేర్కొన్నాడు.

 ప్రపంచకప్ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్:

ప్రపంచకప్ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్:

2008లో విరాట్ కోహ్లీ ప్రపంచకప్‌ గెలవడంతో బీసీసీఐ సెలక్టర్లు అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. సచిన్, సెహ్వాగ్, యువరాజ్, రైనా, ధోనీ, గంభీర్, జహీర్, అశ్విన్ లాంటి సీనియర్లతో ఆడాడు. సీనియర్లకు తీసిపోకుండా పరుగులు చేస్తూ కీలక ఆటగాడిగా మారాడు. ఇక ప్రపంచకప్-2011 ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత మహీ నుంచి జట్టు పగ్గాలు అందుకుని తనకుఎదురులేదని నిరూపించాడు. రికార్డుల రారాజుగా మారాడు.

Story first published: Wednesday, January 1, 2020, 10:50 [IST]
Other articles published on Jan 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+