Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌లో ఆసీస్ పర్యటన: 'పంత్‌ను 4, 5 స్థానాల్లో ఆడించాలి'

Make Rishabh Pant bat at No. 4 or 5 against Australia: Sunil Gavaskar

హైదరాబాద్: యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఆస్ట్రేలియాతో జరిగే ఐదు వన్డేల సిరీస్‌కు ఎంపిక చేయాలని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ సూచించాడు. ఆ సిరిస్‌లో పంత్‌ను 6, 7 స్థానాల్లో కాకుండా 4, 5 స్థానాల్లో ఆడించాలని జట్టు మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ "రిషబ్ పంత్‌ ఉండాలనే చెబుతా. టాప్‌ ఆర్డర్‌లో అతడి ఎడమచేతి వాటం జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుంది" అని అన్నాడు.

పంత్‌ని ఎంపిక చేయాలి

పంత్‌ని ఎంపిక చేయాలి

"సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో పంత్‌ని ఎంపిక చేయాలి. పంత్‌ను 4, 5 స్థానాల్లో బ్యాటింగ్‌కు దింపి అదనపు బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఆడుతున్నాడో తెలుస్తుంది. 6, 7 స్థానాల్లో ఆడిస్తే అతడు భారీ షాట్లకే మొగ్గుచూపుతాడు. ఇది కాదు మనకు కావాల్సింది" అని గవాస్కర్ వెల్లడించాడు.

న్యూజిలాండ్ సిరిస్‌‌కు దక్కని చోటు

న్యూజిలాండ్ సిరిస్‌‌కు దక్కని చోటు

న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరిస్‌తో పాటు బుధవారం నుంచి జరిగే మూడు టీ20ల సిరిస్‌కు సైతం బీసీసీఐ సెలక్టర్లు పంత్‌కు అవకాశం ఇవ్వలేదు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టు సిరిస్ ఆడిన పంత్‌కు ఆ తర్వాత విశ్రాంతినిచ్చారు. ఇప్పటి వరకు కెరీర్‌లో మూడు వన్డేలు ఆడిన రిషభ్ పంత్‌ పెద్దగా రాణించలేదు.

వన్డేల్లో పెద్దగా రాణించని పంత్

వన్డేల్లో పెద్దగా రాణించని పంత్

రెండు ఇన్నింగ్‌ల్లో కేవలం 41 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, టెస్టుల్లో మాత్రం తనదైనశైలిలో అద్భుత ప్రదర్శన చేశాడు. రెండు సెంచరీలు నమోదు చేశాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన టెస్టులో 159 పరుగులతో నాటౌట్‌గా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాడు. అంతేకాదు పుజారా తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

Story first published: Tuesday, February 5, 2019, 11:45 [IST]
Other articles published on Feb 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+