Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రేయస్ అయ్యర్‌కు మరో బిగ్ షాక్!

టీమిండియా స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు గాయం కారణంగా మరోసార ఎదురుదెబ్బ తగిలింది. శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా క్రికెట్‌కు చాలా కాలం దూరంగా ఉండబోతున్నాడు. కడుపులో అంతర్గత గాయం నుంచి కోలుకుంటున్న శ్రేయస్ అయ్యర్.. రాబోయే దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లతో జరిగే వన్డే సిరీస్‌లను కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. తాజా వైద్య నివేదికల ప్రకారం.. శ్రేయస్ అయ్యర్ పూర్తిస్థాయి పునరాగమనం కోసం కనసం రెండు లేదా మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ సమయంలో శ్రేయస్ అయ్యర్ కచ్చితమైన గ్రేడెడ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్‌ను మాత్రమే అనుసరించాలని వైద్యులు సూచించారు. ఆస్ట్రేలియా వన్డే సిరీస్ సమయంలో గాయమైనప్పటి నుంచి శ్రేయస్ అయ్యర్ విశ్రాంతి తీసుకుంటున్నాడు.

సిడ్నీలో గాయం..అంతర్గత రక్తస్రావం
అక్టోబర్ 25న సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో క్యాచ్ తీసుకునే ప్రయత్నంలో శ్రేయస్ అయ్యర్ అసాధారణంగా కింద పడ్డాడు. ఈ ప్రమాదం వల్ల అతనికి కడుపులో గాయం అయి, అంతర్గత రక్తస్రావం జరిగి, ప్లీహం పైన గాయం ఏర్పడింది. రక్తస్రావాన్ని ఆపడానికి చికిత్స చేసిన తర్వాత పరిస్థితి స్థిరపడే వరకు అతన్ని ఐసీయూలో పర్యవేక్షణలో ఉంచారు.

Major Setback for Shreyas Iyer Internal Injury Rules Him Out for 2 3 Months

వైద్యుల పర్యవేక్షణలో శ్రేయస్ అయ్యర్
ఇండియాకు తిరిగి వచ్చినప్పటి నుంచి శ్రేయస్ అయ్యర్ నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. ఈ వారం ప్రారంభంలో అతనికి అల్ట్రాసౌండ్ స్కాన్ నిర్వహించగా.. ఆ ఫలితాలను ప్రముఖ స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ దినషా పర్దివాలా పరిశీలించారు. తాజా స్కాన్ ఫలితాలు సానుకూలంగా ఉండటం, అయ్యర్ కోలుకోవడం స్థిరంగా ఉందని సూచించింది.

రిహాబిలిటేషన్ ప్రణాళిక
ప్రస్తుత పరీక్షల ఫలితాల ఆధారంగా శ్రేయస అయ్యర్ ప్రాథమిక ఐసోమెట్రిక్ వ్యాయామాలు, సాధారణ దైనందిన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతి పొందారు. ప్లీహం గాయం మరింత తీవ్రం కాకుండా ఉండేందుకు కడుపుపై ఒత్తిడి పెంచే ఏ విధమైన శిక్షణనూ కనీసం తదుపరి ఒక నెల పాటు చేయకూడదని సూచించారు. అతని పునరావాస ప్రణాళికలో భాగంగా, రెండు నెలల తర్వాత రెండో అల్ట్రాసౌండ్ స్కాన్ నిర్వహిస్తారు. ఆ తదుపరి స్కాన్ ఫలితాల ఆధారంగా మాత్రమే బీసీసీఐసెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో రిహాబిలిటేషన్ ప్రారంభించడానికి అనుమతిస్తారు.

ఈ గడువును బట్టి చూస్తే శ్రేయస్ అయ్యర్ కనీసం మరో రెండు లేదా మూడు నెలల పాటు ఆటకి దూరంగా ఉంటాడని స్పష్టమవుతోంది. దీంతో శ్రేయస్ అయ్యర్ రాబోయే దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లతో జరిగే వన్డే సిరీస్‌లను కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి 29 ఏళ్ల ఈ ఆటగాడు పూర్తిగా, సురక్షితంగా కోలుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతోంది.

Story first published: Friday, November 21, 2025, 14:38 [IST]
Other articles published on Nov 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+