Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నికోలస్ పూరన్ విధ్వంసం.. క్రిస్ గేల్ వరల్డ్ రికార్డ్ కొద్దిలో మిస్!

మేజర్ లీగ్ క్రికెట్ చరిత్రలోనే ఎంఐ న్యూయార్క్ కెప్టెన్ నికోలస్ పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన నికోలస్ పూరన్.. ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ కేవలం 31 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. నికోలస్ పూరన్ చేసిన ఈ సెంచరీ మొత్తంగా టీ20 క్రికెట్ చరిత్రలో ఇది ఉమ్మడిగా ఆరో వేగవంతమైన సెంచరీ కాగా.. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ టీ20 లీగ్‌లలో ఇది రెండో అత్యంత వేగవంతమైన సెంచరీగా రికార్డుకెక్కింది.

హర్మన్‌ప్రీత్ కౌర్‌కు చెక్? భారత కెప్టెన్సీపై స్మృతి మంధాన ఓపెన్ టాక్!

హర్మన్‌ప్రీత్ కౌర్‌కు చెక్? భారత కెప్టెన్సీపై స్మృతి మంధాన ఓపెన్ టాక్!

33 బంతుల్లో 106 పరుగులు
ఈ మ్యాచ్ లో నికోలస్ పూరన్ కేవలం 33 బంతుల్లోనే 106 పరుగులు చేసి భారీ ఇన్నింగ్స్ ఆడాడు. నికోలస్ పూరన్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, ఏకంగా 13 సిక్సర్లు ఉన్నాయి. కేవలం సిక్సర్లు, ఫోర్లతోనే నికోలస్ పూరన్ స్టేడియంలో పరుగుల వరద పారించాడు. చివరకు ఇన్నింగ్స్ 12వ ఓవర్లో నిఖిల్ చౌదరి బౌలింగ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 30 ఏళ్ల నికోలస్ పూరన్ కు క్రికెట్లో ఇది 5వ సెంచరీ కావడం విశేషం. దీనికి ముందు నికోలస్ పూరన్ 2023 మేజర్ లీగ్ క్రికెట్ సీజన్లో కూడా ఓ సెంచరీ సాధించాడు.

Major League Cricket 2026 Nicholas Pooran Blasts 31-Ball Century Narrowly Misses Chris Gayle T20 World Record

టీ20 లీగ్‌లో రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ
ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో ఫ్రాంచైజీ టీ20 లీగ్‌లలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన క్రిస్ గేల్ రికార్డును నికోలస్ పూరన్ తృటిలో చేజార్చుకున్నాడు. ఐపీఎల్ 2013లో ఆర్సీబీ తరఫున ఆడిన క్రిస్ గేల్ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు. కాగా ఎంఎల్‌సీలో అంతకుముందు అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు ఫిన్ అలెన్(34బంతులు) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్ తో నికోలస్ పూరన్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు.

నెరవేరిన మెస్సీ కల: వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్‌కు అర్జెంటీనా!

నెరవేరిన మెస్సీ కల: వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్‌కు అర్జెంటీనా!

ఫ్రాంచైజీ టీ20 లీగ్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీలు
క్రిస్ గేల్ - 30 బంతులు (ఐపీఎల్)
నికోలస్ పూరన్ - 31 బంతులు (ఎంఎల్సీ)
ఫిన్ అలెన్ - 34 బంతులు (ఎంఎల్సీ)
వైభవ్ సూర్యవంశీ - 35 బంతులు (ఐపీఎల్)
ఉస్మాన్ ఖాన్ - 36 బంతులు (పీఎస్ఎల్)

నికోలస్ పూరన్ తో పాటు ఎంఐ న్యూయార్క్ జట్టులోని మిగతా బ్యాటర్లు కూడా చెలరేగి ఆడారు. ఓపెనర్ క్వింటన్ డికాక్ తో కలిసి నికోలస్ పూరన్ రెండో వికెట్ కు కేవలం 42 బంతుల్లోనే 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. క్వింటన్ డికాక్ 24 బంతుల్లో 51 పరుగులు చేయగా.. ఆ తర్వాత వచ్చిన కీరన్ పొలార్డ్ 25 బంతుల్లోనే 8 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేసిన విధ్వంసం సృష్టించాడు. ఓ దశలో 15 ఓవర్లకు 233 పరుగులు చేసిన ఎంఐ న్యూయార్క్ జట్టు.. ఆ తర్వాత వాషింగ్టన్ ఫ్రీడమ్ బౌలర్లు పుంజుకోవడంతో నిర్ణీత ఓవర్లలో 266 పరుగుల భారీ స్కోరు వద్ద ఆగింది.

Story first published: Thursday, July 16, 2026, 10:53 [IST]
Other articles published on Jul 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+