Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MLC 2024: ముంబై ఇండియన్స్ ఔట్.. షాకిచ్చిన సూపర్ కింగ్స్

అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్-2024లో డిఫెండింగ్ ఛాంపియన్ 'ముంబై ఇండియన్స్ న్యూయార్క్' టోర్నీ నుంచి నిష్క్రమించింది. టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓటమిపాలైంది. ఓ దశలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా కొనసాగించింది. కానీ డ్రింక్స్ బ్రేక్ తర్వాత సూపర్ కింగ్స్ విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను లాగేసుకున్నారు.

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 163 పరుగులు చేసింది. రషీద్ ఖాన్ (55; 30 బంతుల్లో, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకం సాధించాడు. మోనాంక్ పటేల్ (48; 41 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. స్టొయినిస్, ఆరోన్ చెరో రెండు వికెట్లు తీశారు. అయితే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూయార్క్‌కు పేలవమైన ఆరంభం దక్కింది.

Major League Cricket 2024 Texas Super Kings Eliminate Defending Champions MI New York in Thrilling Eliminator

18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కీలక బ్యాటర్లు బ్రెవిస్ (డకౌట్), నికోలస్ పూరన్ (8) ఔటయ్యారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన మోనాంక్‌తో కలిసి ఓపెనర్ జహంగీర్ (26; 23 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే వీరిద్దరు నెమ్మదిగా ఆడారు. రషీద్ ఖాన్ క్రీజులోకి వచ్చిన తర్వాత స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఆఖరి ఏడు బంతులకు న్యూయార్క్ నాలుగు వికెట్లు కోల్పోయింది.

అనంతరం ఛేదనలో టెక్సాస్ సూపర్ కింగ్స్ వికెట్ నష్టానికి 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. తొలి వికెట్‌కు ఓపెనర్లు డెవాన్ కాన్వే (51 నాటౌట్; 43 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), డుప్లెసిస్ (72; 47 బంతుల్లో, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) శతక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే 15 ఓవర్లకు టెక్సాస్ స్కోరు 116/1 మాత్రమే. కానీ బ్రేక్ అనంతరం కాన్వే, ఆరోన్ హార్డీ (40 నాటౌట్; 22 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగారు. 16, 17, 18వ ఓవర్ల‌లో వరుసగా 12, 14, 18 పరుగులు సాధించారు.

Story first published: Thursday, July 25, 2024, 12:45 [IST]
Other articles published on Jul 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+