Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MLC 2024: పొలార్డ్ ఊచకోత.. ప్లేఆఫ్స్‌‌కు ముంబై ఇండియన్స్

అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్-2024‌లో డిఫెండింగ్ ఛాంపియన్ 'ముంబై ఇండియన్స్ న్యూయార్క్' ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. తదుపరి దశకు చేరాలంటే లాస్ ఏంజెల్స్ నైట్‌రైడర్స్‌పై 18.2 ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదించాల్సిన మ్యాచ్‌లో ఎంఐ న్యూయార్క్ చెలరేగింది. 131 పరుగుల లక్ష్యాన్ని 17 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

ఎంఐ న్యూయార్క్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ విధ్వంసం సృష్టించాడు. 12 బంతుల్లో అజేయంగా 33 పరుగులు చేశాడు. రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ముందుకు సాగగా, నైట్‌రైడర్స్ ఇంటిముఖం పట్టింది. ఇరు జట్లు అయిదు పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ ఎంఐ న్యూయార్క్ నెట్‌రన్‌రేటు ఆధారంగా ప్లేఆఫ్స్‌కు చేరింది. ఏడు మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్, నైట్‌రైడర్స్ రెండింట్లో విజయం సాధించి మిగిలిన నాలుగింట్లో ఓటమిపాలైంది.

Major League Cricket 2024 Pollard s Devastating Innings Propels MI New York to the Playoffs

కాగా, మొదట బ్యాటింగ్ చేసిన లాస్ ఏంజల్స్ 19.1 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. రసెల్ (35; 21 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. జేసన్ రాయ్ (27; 23 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. రషీద్ ఖాన్ (3/22) మూడు వికెట్లు, బౌల్ట్ (2/38), కెంజిగే (2/22) చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ న్యూయార్క్ 17 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. నికోలస్ పూరన్ (35; 28 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), పొలార్డ్ (33 నాటౌట్; 12 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), డెవాల్డ్ బ్రెవిస్ (27; 19 బంతుల్లో, 5 ఫోర్లు) రాణించారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో నరైన్ రెండు వికెట్లు తీశాడు.

అయితే న్యూయార్క్ ఛేదన అంత సాఫీగా సాగలేదు. 42 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓ ఓండ్‌లో పూరన్ లక్ష్యాన్ని కరిగిస్తున్నా మరో ఎండ్ నుంచి సహకారం దక్కలేదు. వరుసగా సహచరులు పెవిలియన్‌కు చేరుతున్నారు. కానీ ఏడో స్థానంలో వచ్చిన పొలార్డ్.. పూరన్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆఖర్లో పూరన్ ఔటైనప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చాడు.

Story first published: Monday, July 22, 2024, 13:32 [IST]
Other articles published on Jul 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+