Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CT 2025: సెమీస్‌కు ముందు ఆసీస్‌ జట్టుకు ఎదురుదెబ్బ.. కీలక ఆటగాడు ఔట్

Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్ లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుండగా.. రెండో సెమీఫైనల్ లో సౌతాఫ్రికా న్యూజిలాండ్ తో తలపడనుంది. సెమీ-ఫైనల్ మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ మాథ్యూ షార్ట్ గాయపడి టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. కానీ అతడి స్థానంలో బలమైన ఆటగాడిని జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

జట్టులోకి కొత్త ఆటగాడు
ఆస్ట్రేలియా జట్టులో మాథ్యూ షార్ట్ స్థానంలో మరొకరిని ప్రకటించారు. మాథ్యూ షార్ట్ స్థానంలో కూపర్ కొన్నోలీని ఆసీస్ జట్టులోకి తీసుకుంది. కూపర్ కొన్నోలీ మంచి ఆల్‌రౌండర్. కూపర్ కొన్నోలీ బ్యాటింగ్ తో పాటు స్పిన్ బౌలింగ్ లో కూడా ప్రావీణ్యం కలిగి ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మాథ్యూ షార్ట్ గాయపడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఆసీస్ జట్టు మరో ఆటగాడిని జట్టులోకి తీసుకోవాల్సి వచ్చింది.

Major Blow for Australia Team Key Player Out Before Semifinals in Champions Trophy 2025

ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈ మేరకు వెల్లడించాడు. మాథ్యూ షార్ట్ పూర్తిగా ఫిట్ గా లేడని.. గాయం వల్ల సరిగ్గా కదలలేకపోతున్నాడని స్టీవ్ స్మిత్ తెలిపాడు. తదుపరి మ్యాచ్ వరకు కోలుకోవడం కష్టమని పేర్కొన్నాడు. ఈ క్రమంలో మరొకరిని జట్టులోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు మీడియాతో మాట్లాడుతూ స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు.

మాథ్యూ షార్ట్ కెరీర్ ఇలా..
29 ఏళ్ల మాథ్యూ షార్ట్ 2023లో ఆస్ట్రేలియా తరఫున వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి మాథ్యూ షార్ట్ ఆస్ట్రేలియా తరఫున 15 వన్డేలు ఆడాడు. ఇందులో రెండు అర్థ సెంచరీలు చేశాడు. మొత్తంగా వన్డేల్లో 280 పరుగులు చేశాడు. 14 టీ20ల్లో 163.7 స్ట్రైక్ రేట్ తో ఒక అర్థశతకంతో 293 పరుగులు చేశాడు.

జట్టులోకి కొన్నోలీ
కూపర్ కొన్నోలీని ఆస్ట్రేలియన్ జట్టులో ట్రావెలింగ్ రిజర్వ్‌గా చేర్చారు. కూపర్ కొన్నోలీని ఆస్ట్రేలియా జట్టులో చేర్చడానికి ఐసీసీ టెక్నికల్ కమిటీ ఆమోదం తెలిపింది. కూపర్ కొన్నోలీ గత సంవత్సరం ఇంగ్లాండ్ తో జరిగిన వన్డేలో అరంగేట్రం చేశాడు. అతను ఇప్పటివరకు మూడు వన్డే మ్యాచ్ లు ఆడాడు. కొన్నోలీ బ్యాట్ నుంచి కేవలం 10 పరుగులు మాత్రమే వచ్చాయి. అయితే టీమిండియతో జరిగే సెమీ ఫైనల్ లో ఆడతాడో లేదో కచ్చితంగా తెలియదు. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11లో జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ ను ఓపెనర్ గా చేర్చుకునే అవకాశం ఉంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Story first published: Monday, March 3, 2025, 9:57 [IST]
Other articles published on Mar 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+