Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Team India : టీమిండియా ముందున్న అతి పెద్ద సమస్య.. వరల్డ్ కప్ గెవాలంటే సమస్య తీరాల్సిందే!

Main problem Team India should address before ODI World Cup

టీమిండియా మంచి బలంగా కనిపిస్తోంది. స్వదేశంలో వరుసగా వన్డే, టీ20 సిరీసులు గెలుస్తోంది. వన్డే వరల్డ్ కప్ కూడా ఇదే సంవత్సరంలో ఉండటంతో భారత్‌పై మరింత అంచనాలు పెరుగుతున్నాయి. అయితే భారత జట్టులో సమస్యలేవీ లేవని కావు. జట్టులో కొన్ని కీలక సమస్యలు కూడా ఉన్నాయి. మరి టీమిండియా బలాబలాలు ఏంటో ఒకసారి చూస్తే..

 బ్యాటింగ్ బలం

బ్యాటింగ్ బలం

టీమిండియా అంటే బ్యాటింగ్ అనే చెప్పాలి. వన్డే క్రికెట్‌లో అత్యధికంగా డబుల్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు మన వాళ్లే. సచిన్ ఈ విషయంలో తొలి అడుగు వేయగా.. సెహ్వాగ్, రోహిత్, ఇషాన్ కిషన్, తాజాగా శుభ్‌మన్ గిల్ ఈ ఘనత సాధించారు. రోహిత్ అయితే ఏకంగా మూడు సార్లు వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం టీమిండియాలో కూడా రోహిత్, గిల్ ఇద్దరూ ఓపెనర్లు. వీళ్ల తర్వాత విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వంటి బ్యాటర్లతో టీమిండియా బ్యాటింగ్ విభాగం దుర్భేద్యంగా ఉంది.

బౌలింగ్ అంతంతమాత్రమే..

బౌలింగ్ అంతంతమాత్రమే..

స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఇది భారత జట్టుపై చాలా ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రస్తుతానికి మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ.. మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ వంటి బౌలర్లు ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. బుమ్రా కనుక జట్టుతో చేరి, అతను కూడా మంచి ఫామ్‌ అందుకుంటే భారత పేస్ బౌలింగ్ విభాగం మరింత బలంగా మారుతుంది. ఇక స్పిన్నర్లలో చాహల్ ఫామ్‌లో లేకపోయినా.. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ వంటి వారు ఉండనే ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికి భారత పేసర్లు తమ ఆటను మెరుగు పరుచుకోవాల్సి ఉంది.

 ట్యాలెంట్ పూల్..

ట్యాలెంట్ పూల్..

టీమిండియా బ్యాటింగ్ ట్యాలెంట్ పూల్ చాలా భారీగా ఉంది. గిల్, రోహిత్ కాకుండా జట్టుకు సరైన ఓపెనర్ కావాలి అనుకుంటే.. సెలెక్టర్ల వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్లర్లు కావాలంటే శిఖర్ ధవన్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, దేవదత్ పడిక్కల్ వంటి వాళ్లు ఉన్నారు. రైట్ హ్యాండర్లలో రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా, సంజూ శాంసన్ తదితరులు ఉన్నారు. సంజూ వంటి ఆటగాళ్లు ఏ స్థానంలో అయినా ఆడగలరు. కానీ బౌలర్లలో అంత గొప్ప ట్యాలెంట్ పూల్ భారత్ వద్ద లేదు. యష్ ధుల్, కుల్దీప్ సేన్, మొహ్‌సిన్ ఖాన్, ఆవేష్ ఖాన్ వంటి వాళ్లు అంతర్జాతీయ స్థాయిలో అంత గొప్పగా రాణించగలరన్న నమ్మకం లేదు. ఐపీఎల్‌లో సత్తా చాటిన వీళ్లలో ఆవేష్ ఖాన్ అంతర్జాతీయ మ్యాచుల్లో పెద్దగా ఆకట్టుకోని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ ముందున్న అతి పెద్ద సవాల్ బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేయడమే అని చెప్పాలి.

Story first published: Monday, January 23, 2023, 15:59 [IST]
Other articles published on Jan 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+