Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందున్న ప్రధాన సమస్య అదే..!

ఐపీఎల్‌లో ఎంత బాగా రాణించినా ఇప్పటి వరకు ట్రోఫీ నెగ్గని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఈ జట్టు ముందు ఇప్పుడు కూడా ఒక ప్రధాన సమస్య కనిపిస్తోంది. అదే బౌలింగ్. గత మూడు సీజన్లలలో వరుసగా ఐపీఎల్ నాకౌట్స్ చేరిన ఆర్సీబీ.. ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గలేదు. గతేడాది చాలా మంది ఆటగాళ్లు ఫామ్‌లో లేకున్నా క్వాలిఫైయర్-2 చేరింది. కానీ ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ఓడింది.

చిన్నస్వామి స్టేడియమే పెద్ద సమస్య..

చిన్నస్వామి స్టేడియమే పెద్ద సమస్య..

వచ్చే ఏడాది ఆర్సీబీ ముందు ఉన్న ప్రధాన సమస్య బౌలింగ్ విభాగంలో లోపమేనని మాజీ దిగ్గజం ఆకాష్ చోప్రా చెప్పాడు. ఆర్సీబీ హోం గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియం పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ రాణించే బౌలర్లు బెంగళూరు వద్ద లేరని చోప్రా అభిప్రాయపడ్డాడు. 'ఆర్సీబీ దగ్గర ఆరో బౌలింగ్ ఆప్షన్ ఉండాలి. లేదంటే చిన్నస్వామి స్టేడియం ఆ జట్టు బౌలింగ్ విభాగంపై దయ చూపించదు. అక్కడ చాలా కష్టపడాల్సి వస్తుంది. గతంలో దుబాయ్, యూఏఈ మైదానాల్లో ఆర్సీబీకి ఇది పెద్ద సమస్య కాలేదు. కానీ చిన్నస్వామి స్టేడియంలో ఇది చాలా పెద్ద సమస్య' అని స్పష్టం చేశాడు.

హాజిల్‌వుడ్ స్థానంలో అతనే బెటర్..

హాజిల్‌వుడ్ స్థానంలో అతనే బెటర్..

అలాగే ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ ఈసారి ఐపీఎల్ ఆరంభంలో కొన్ని మ్యాచులకు దూరం అవుతున్నాడు. ఈ విషయాన్ని గుర్తుచేసిన ఆకాష్ చోప్రా.. అతని స్థానాన్ని తాజాగా కొనుగోలు చేసిన రీస్ టాప్లేతో ఆర్సీబీ భర్తీ చేయడానికి ప్రయత్నించాలని చెప్పాడు. అంతేకానీ, డేవిడ్ విల్లేతో హాజిల్‌వుడ్ స్థానాన్ని భర్తీ చేయడం, అదీ ముఖ్యంగా చిన్నస్వామి స్టేడియంలో సాధ్యం కాదని అభిప్రాయపడ్డాడు. పేసర్లతోపాటు షాబాజ్ అహ్మద్, వానిందు హసరంగ మీదనే ఆధార పడినా కూడా ఆర్సీబీకి కష్టాలు తప్పవన్నాడు. హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్‌కు కూడా చిన్నస్వామి స్టేడియంలో అంత గొప్ప రికార్డు లేదు.

స్పిన్నర్లకు చాలా కష్టం..

స్పిన్నర్లకు చాలా కష్టం..

'లంక ప్రీమియర్ లీగ్ చూస్తే.. హసరంగ కూడా భారీగా పరుగులు సమర్పించుకుంటాడని కనిపిస్తోంది. ఇక చిన్నస్వామి వంటి స్టేడియంలో షాబాజ్ తన కోటా ఓవర్లు వేస్తాడా? అనేది అనుమానమే. అప్పుడు ఈ సమస్యను తీర్చడం కోసం మహిపాల్ లోమ్రోర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే గ్లెన్ మ్యాక్స్‌వెల్ చేత కూడా బౌలింగ్ చేయించాలి. అయితే చిన్నస్వామి స్టేడియంలో బౌలర్లు ఎక్కువ లెంగ్త్ డెలివరీలు వేసే అవకాశం ఉండదు. ఎందుకంటే అది పూర్తిగా బ్యాటింగ్ పిచ్' అని చప్రా వివరించాడు. మరి ఈ సమస్యను ఆర్సీబీ ఎలా తీర్చుకుంటుందో చూడాలి.

Story first published: Wednesday, December 28, 2022, 17:57 [IST]
Other articles published on Dec 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+