For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 సంచలనం.. 8 బంతుల్లో 5 వికెట్లు.. 40 ఏళ్ల వయస్సులోనూ తగ్గలేదయ్యో!

Mahesh Tambe: ఫిన్‌లాండ్ క్రికెట్ జట్టు ఇటీవల ఎస్టోనియాలో పర్యటించింది. అక్కడ జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఫిన్‌లాండ్ 2-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లోని చివరిదైన మూడో మ్యాచ్.. మహేష్ తాంబే అద్భుత ప్రదర్శనకు వేదికగా నిలిచింది. టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 5 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా మహేష్ తాంబే నిలిచాడు. కేవలం 8 బంతుల్లోనే 5 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 19 పరుగులు ఇచ్చి 5 కీలక వికెట్లను పడగొట్టాడు. ఈ అసాధారణ ప్రదర్శనతో మహేష్ తాంబే తన జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా తన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు. తాంబే అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన వల్ల ఫిన్‌లాండ్ చివరి టీ20 మ్యాచ్‌లో ఎస్టోనియాను 5 వికెట్ల తేడాతో ఓడించింది.

ఎవరీ మహేష్ తాంబే?.. 40 ఏళ్ల వయస్సులోనూ దూకుడు తగ్గని బౌలర్!
మహేష్ తాంబే 1985 సెప్టెంబర్ 25న జన్మించాడు. మహేష్ తాంబే కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 40 ఏళ్ల వయస్సులో కూడా ఈ అనుభవజ్ఞుడైన ఆటగాడు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనలతో ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇది మహేష్ తాంబే ఫిట్‌నెస్, అంకితభావానికి నిదర్శనం. ఇప్పటివరకు మహేష్ తాంబే తన టీ20 కెరీర్‌లో 24 మ్యాచ్‌లు ఆడి, మొత్తం 28 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో మహేష్ తాంబే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన(19 పరుగులకు 5 వికెట్లు).. ఎస్టోనియాపైనే నమోదు కావడం విశేషం.

Mahesh Tambe Takes 5 Wickets in 8 Balls at 40 T20 Sensation in Finland vs Estonia

ఎస్టోనియా తడబాటు.. ఫిన్‌లాండ్ విజయం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్టోనియా జట్టు.. మహేష్ తాంబే ధాటికి తట్టుకోలేకపోయింది. నిర్ణీత 19.4 ఓవర్లలో కేవలం 141 పరుగులకే ఆలౌట్ అయింది. ఎస్టోనియా తరఫున బ్యాటింగ్ చేస్తూ బిలాల్ మసూద్ అత్యధికంగా 26 పరుగులు చేశాడు. అయితే జట్టులోని ఏడుగురు బ్యాటర్లు కనీసం రెండంకెల స్కోరు కూడా దాటలేకపోయారు. ముగ్గురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు.

142 పరుగుల లక్ష్య ఛేదనలో ఫిన్‌లాండ్ జట్టు 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి సునాయాసంగా విజయాన్ని అందుకుంది. ఫిన్‌లాండ్ తరఫున ఓపెనర్ అరవింద్ మోహన్ 67 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని స్కోరులో 6 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. అతనికి తోడుగా ఫరాజ్ మెహతి అబ్బాస్ 19 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషిచాడు. ఎస్టోనియా బౌలర్లలో హబీబ్ ఖాన్, అర్ల్సాన్ చెరో 2 వికెట్లు పడగొట్టినప్పటికీ తమ జట్టును గెలిపించలేకపోయారు.

Story first published: Tuesday, July 29, 2025, 13:31 [IST]
Other articles published on Jul 29, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+