న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్-వెస్టిండీస్‌కు 1500మందితో భద్రతా ఏర్పాట్లు

Mahesh Bhagwat giving security to cricket india-west indies match

న్యూఢిల్లీ: ఈ నెల 12న ఉప్పల్ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టెస్టుకు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. విలేకరులతో మహేశ్‌ భగవత్‌ మాట్లాడుతూ..ఈ 1500 మంది పోలీసులతో పాటుగా స్టేడియం మేన్‌జ్‌మెంట్‌ కూడా ప్రత్యేకంగా ప్రైవేటు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసిందని వెల్లడించారు.

జిమ్‌లో ప్రాక్టీసు చేస్తోన్న ధావన్(వీడియో)జిమ్‌లో ప్రాక్టీసు చేస్తోన్న ధావన్(వీడియో)

 100 సీసీ టీవీ కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం

100 సీసీ టీవీ కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం

100 సీసీ టీవీ కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం చేశామని తెలిపారు. రెండో టెస్టుకు హాజరయ్యే ప్రేక్షకులు భద్రత అధికారుల సూచనలు పాటిస్తూ సెల్‌ఫోన్‌ తీసుకెళ్లవచ్చని తెలిపారు. లాప్‌టాప్‌లు, కెమెరాలు, పవర్‌బ్యాంక్‌లు, ఎలక్ట్రానిక్‌ ఐటమ్స్‌, కాయిన్స్‌, లైటర్స్‌, హెల్మెట్స్‌, ఫెర్ప్యూమ్స్‌, బ్యాగ్స్‌, వాటర్‌ బాటిల్స్‌, బయటి తినుబండారాలకు అనుమతి లేదని వివరించారు.

4900 వరకు బైక్‌లను పార్కింగ్‌ సౌకర్యాలు

4900 వరకు బైక్‌లను పార్కింగ్‌ సౌకర్యాలు

ఫోర్‌ వీలర్‌ వాహనాలకు 16 చోట్ల పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశామని, 4900 వరకు బైక్‌లను పార్కింగ్‌ చేసుకునేందుకు సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు. కాగా మ్యాచ్ చూసేందుకుగాను ప్రతిరోజు 4 వేల మంది పాఠశాల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో

ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాబోయే శుక్రవారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. కాంప్లిమెంటరీ పాసుల విషయంలో వివాదం తలెత్తడంతో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వేదికగా జరగాల్సిన రెండో వన్డే భారత్‌, వెస్టిండీస్‌ మధ్య అక్టోబరు 24న ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో నిర్వహించనున్నారు. రెండు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత ఇరు జట్లు వన్డే, టీ20 సిరీస్‌లో పోటీ పడనున్నాయి.

భద్రతా నియమాల దృష్ట్యా:

భద్రతా నియమాల దృష్ట్యా:

భద్రతా నియమాల దృష్ట్యా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని 54 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ క్రితం నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సంబంధిత ఉత్తర్వులో పేర్కొన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 12 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు కమిషనర్ సజ్జనార్ సెప్టెంబరు 10న ఉత్తర్వులు జారీ చేశారు.

Story first published: Tuesday, October 9, 2018, 14:09 [IST]
Other articles published on Oct 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X