Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ గ్యారేజ్‌లో మరో కొత్తవాహనం.. రాంచీ వీధుల్లో చక్కర్లు.. అభిమానులతో సెల్ఫీలు!!

MS Dhoni Riding New Car, Used By Indian Army, On Ranchi Streets || Oneindia Telugu
Mahendra Singh Dhoni riding new car Nissan Jonga at Ranchi streets

రాంచీ: టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు (2007, 2011) అందించి భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానుల గుండెల్లో చెరిగిపోని ముద్రవేశాడు. అయితే ధోనీకి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో.. కార్లు, బైక్‌లు అంటే కూడా అంతే ప్రాణం. ధోనికి రైడింగ్ అంటే మక్కువ ఉండడంతో కొన్ని సార్లు క్రికెట్ స్టేడియంలోనే బైక్, కార్లు నడిపి సరదా తీర్చుకున్నాడు. చాలాసార్లు బైక్, కార్లు వేసుకొని రాంచీ రోడ్లపైకి వచ్చేస్తాడు. తను కొన్నవి, బహుమతిగా వచ్చిన అన్ని బైకులను నడుపుతూ సరదా తీర్చుకుంటాడు.

ధోనీ గ్యారేజ్‌లో నిసాన్‌ జోంగా:

ధోనీ గ్యారేజ్‌లో నిసాన్‌ జోంగా:

ధోనీ మార్కెట్లోకి వచ్చిన వెరైటీ బైక్‌, కార్లను కొనుగోలు చేస్తుంటాడు. వాహనాల కలెక్షన్ అతనికి ఇష్టం. ఇప్పుడు ధోనీ కారు కలెక్షన్ జాబితాలో మరో కొత్త వాహనం చేరింది. తాజాగా ధోనీ మరో కొత్త జీపు కొన్నాడు. అయితే ఈ సారి ధోనీ కొన్న కారు కాస్త విభిన్నంగా ఉంది. భారత సైనికులు ఉపయోగించే 'నిసాన్‌ జోంగా' మోడల్‌ జీపును మహీ కొనుగోలు చేసాడు.

అభిమానులతో సెల్ఫీలు:

అభిమానులతో సెల్ఫీలు:

ధోనీ ఆదివారం రాంచీ వీధుల్లో కొత్తగా కొన్న నిసాన్‌ జోంగా జీపును నడుపుతూ ఆస్వాదించాడు. ధోనీ జీపు నడుపుతూ తన ఇంటికి సమీపంలోని ఓ పెట్రోల్‌ బంకు వద్దకు వెళ్లాడు. అక్కడ ధోనీని చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. పెట్రోల్‌ బంకులో అభిమానులు ధోనీ వద్దకు చేరుకుని ఫొటోలు దిగేందుకు ప్రయతించారు. అభిమానులను నిరుత్సాహపరచకుండా సెల్ఫీలు దిగి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. అనంతరం అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

గత నెలలో గ్రాండ్‌ చెరోకీ:

గత నెలలో గ్రాండ్‌ చెరోకీ:

గత నెల సెప్టెంబర్‌లోనూ ధోనీ భారత తొలి గ్రాండ్‌ చెరోకీ జీపును కొన్న విషయం తెలిసిందే. ఆ జీపు ఇంటికి వచ్చిన సమయంలో ధోనీ సైనిక విధుల్లో ఉండటంతో.. తిరిగి వచ్చిన వెంటనే అందులో చక్కర్లు కొట్టాడు. చెరోకీ భారత్‌లోనే అత్యంత ఖరీదైన, ఏకైక కారు. ఈ కారు ధర రూ.1.12 కోట్లు (ఎక్స్-షోరూమ్ ధర). గ్రాండ్ చెరోకీ ఎస్‌ఆర్‌టీ 2017లో అమెరికాలో లాంచ్ చేశారు. 3.62 సెకండ్ల వ్యవధిలో వంద కిలో మీటర్ల వేగం అందుకునే ఎస్‌యూవీలలో ఇది ఒకటి.

ధోనీ గ్యారేజ్‌:

ధోనీ గ్యారేజ్‌:

ధోనీ ఇప్పటికే తాను సేకరించిన కార్లు, బైక్‌ల కోసం సొంతంగా అతిపెద్ద గ్యారేజ్‌ను ఏర్పాటు చేసుకొన్నాడు. ధోనీ గ్యారేజ్‌లో ఫెరారీ 599 జీటీవో, హమ్మర్ హెచ్ -2, జీఎంసీ సియారా, కవాసకీ నింజా హెచ్ -2, కాన్ఫెడరేట్ హెల్ క్యాట్, బీఎస్ ఏ, సుజికీ హయాబుషా, నోర్టాన్ వింటేజ్ లాంటి అరుదైన బ్రాండ్లు డజన్లు కొద్ది ఉన్నాయి.

క్రికెట్‌కు తాత్కాలిక విరామం:

క్రికెట్‌కు తాత్కాలిక విరామం:

ప్రపంచకప్ అనంతరం ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. భారత ఆర్మీకి సేవలందిచాలనే ఉద్దేశంతో వెస్టిండీస్‌ పర్యటనకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌కు కూడా అందుబాటులో లేడు. నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. ప్రస్తుతం ధోనీ కుటుంబంతో గడుపుతున్నాడు.

Story first published: Tuesday, October 22, 2019, 9:08 [IST]
Other articles published on Oct 22, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+