
ధోని ఒక్కడే అలా
భారత్‌లో ఎవరైనా ఆటలో సత్తాచాటి జేఎస్‌సీఏలో చోటు సంపాదించుకున్న క్రికెటర్ ఉన్నాడంటే అది ధోనీ మాత్రమేనని సురేష్ కుమార్ పేర్కొన్నారు. జేఎస్‌సీఏలో పలువురు ప్రభుత్వాధికారులు, లాయర్లు, వ్యాపారవేత్తలు, చివరకు బాడీగార్డులకు కూడా శాశ్వత సభ్యత్వం ఉంది.

బినామీలుగా పెట్టి ఆధిపత్యం చెలాయిస్తున్నారు
అసోసియేషన్‌లో కొందరు పేరున్న పెద్దలు తమ స్నేహితులను, బంధువులను బినామీలుగా పెట్టి, తమ ఆధిపత్యం చెలాయిస్తున్నారని మాజీ సభ్యుడు సునీల్ సింగ్ ఆరోపించారు. జార్ఖండ్ రాష్ట్రం తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడిన ప్రదీప్ ఖన్నా, ఆదిల్ హుస్సేన్ లాంటి వాళ్లకు కూడా క్రికెట్ సంఘంలో సభ్యత్వం లేదు.

ధోని చేసిన సేవ విలువకట్టలేనిది
‘అసోసియేషన్‌లో గౌరవ సభ్యత్వం గౌరవ సూచకంగా ఉంటుంది. భారత క్రికెట్‌కు ధోని చేసిన సేవ మనం విలువకట్టలేనిది. అతని గౌరవ సభ్యత్వంపై ఎందుకింత ఆందోళన చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదని' జేఎస్‌సీఏ అధ్యక్షుడు అమితాబ్ చౌదరి అన్నారు.

అసోసియేషన్‌కే గౌరవం ఉంటుంది
ధోనీ శాశ్వత సభ్యుడిగా ఉంటే అది అసోసియేషన్‌కే గౌరవం ఉంటుందని జేఎస్‌సీఏ ఆయన సభ్యులకు తెలిపారు. కాగా, ధోని జార్ఖండ్ రాజధాని రాంచిలో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే.

పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అంబాసిడర్
రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు సైతం ఒప్పుకున్నాడు. వచ్చే నెలలో తొలిసారి రాష్ట్రంలో నిర్వహిస్తున్న పెట్టుబడిదారుల సదస్సుకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.


Click it and Unblock the Notifications