Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20ల్లో ధోని అరుదైన ఘనత: ఐదో భారత ఆటగాడిగా రికార్డు

Mahendra Singh Dhoni Becomes Fifth Indian To Score 6000 Runs In T20s

హైదరాబాద్: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని టీ20 క్రికెట్‌లో ఆరువేలకు పైగా పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఐదో భారతీయుడిగా ధోని ఈ ఘనతను అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌కి ముందు 10 పరుగుల దూరంలో ధోని

ఈ మ్యాచ్‌కి ముందు 10 పరుగుల దూరంలో ధోని

ఈ మ్యాచ్‌కు ముందు ధోని ఆరు వేల పరుగులు చేసేందుకు గాను 10 పరుగుల దూరంలో ఉన్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ధోని 17 పరుగుల వద్ద బౌల్ట్‌ బౌలింగ్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ధోని టీ20 క్రికెట్‌లో ఆరు వేల పరుగులు సాధించిన ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

ఐదో భారత ఆటగాడిగా ధోని

ఐదో భారత ఆటగాడిగా ధోని

అంతకముందు సురేశ్‌ రైనా(7,708), విరాట్‌ కోహ్లీ (7,621), రోహిత్‌ శర్మ(7,303), గౌతమ్‌ గంభీర్‌(6,402)లు ఈ ఘనత సాధించిన వారిలో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనికి ఇది 290వ టీ20 మ్యాచ్‌. అంతేకాదు ఐపీఎల్‌లో నాలుగువేల పరుగుల క్లబ్‌కు ధోని చేరువయ్యాడు. ఇప్పటివరకు ధోని ఐపీఎల్‌లో 3,974 పరుగులు సాధించాడు.

మరో 26 పరుగులు సాధిస్తే

మరో 26 పరుగులు సాధిస్తే

మరో 26 పరుగులు సాధిస్తే.. ఐపీఎల్‌లో నాలుగువేల పరుగులు సాధించిన ఆటగాడిగా ధోని నిలుస్తాడు. ఇదిలా ఉంటే శుక్రవారం రాత్రి చెన్నై-ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అభిమానుల నుంచి ధోనికి అరుదైన గౌరవం దక్కింది. అంబటి రాయుడు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనికి అభిమానులు ధోని.. ధోని.. అంటూ తన సెల్‌ఫోన్లలోని లైట్‌ను ఆన్‌చేసి చూపిస్తూ స్వాగతం పలికారు.

ధోని నామస్మరణతో మారుమోగిన కోట్లా స్టేడియం

ధోని నామస్మరణతో మారుమోగిన కోట్లా స్టేడియం

సుమారు ఒక నిమిషం పాటు ధోని నామస్మరణతో స్టేడియమంతా మారుమోగిపోయింది. ఈ మ్యాచ్‌లో చెన్నై 34 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ బెర్తుని దక్కించుకున్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో చెన్నై తన చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది.

Story first published: Saturday, May 19, 2018, 15:02 [IST]
Other articles published on May 19, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+