రవిశాస్త్రి స్థానంలో టీమిండియా కొత్త కోచ్‌గా శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం!

హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్ రేసులో శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం మహేలా జయవర్దనే ముందంజలో ఉన్నట్లు సమాచారం. టీమిండియా కోచ్ పదవికి జయవర్దనే సైతం ఆసక్తిగా ఉన్నాడు. త్వరలోనే అతడు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోనున్నట్లు ఓ ప్రముఖ వెబ్‌సైట్‌లో కథనం వచ్చింది.
మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్
టీమిండియా హెడ్ కోచ్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కు సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) మంగళవారం దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సారి కొత్తగా వయసుతో పాటు అనుభవాన్ని కొలమానంగా తీసుకోవాలంటూ ఐసీసీ కొత్త నిబంధనలను విధించింది.

60 ఏళ్లకు మించరాదనే నిబంధన
కోచ్ పదవి అభ్యర్థులకు కనీసం రెండేళ్ల అంతర్జాతీయ అనుభవంతో పాటు వయసు 60 ఏళ్లకు మించరాదని అందులో పేర్కొంది. హెడ్ కోచ్‌తో పాటు బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్, స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్‌లు, ఫిజియో థెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌ను తిరిగి నియమించనున్నట్లు బీసీసీఐ అందులో పేర్కొంది.

జులై 30, సాయంత్రం ఐదు గంటల్లోగా
ఆసక్తి కలిగిన అభ్యర్దులు జులై 30, సాయంత్రం ఐదు గంటల్లోగా దరఖాస్తులు అందజేయాలని బీసీసీఐ పేర్కొంది. కొత్త కోచ్‌ని మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ నాయకత్వంలోని క్రికెట్ అడ్వైజయిరీ కమిటీ ఎంపిక చేయనుంది. కోచ్‌గా మహేలా జయవర్దనే సైతం అద్భుతమైన రికార్డుని కలిగి ఉన్నాడు.

కోచ్‌గా జయవర్దనేకి అద్భుతమైన రికార్డు
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు మహేలా జయవర్ధనే కోచ్‌గా ఎంపికైన తర్వాత జరిగిన మూడు ఎడిషన్లలో రెండు సార్లు ఆ జట్టు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో పాటు ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలతో అతడికి మంచి సాన్నిహిత్యం ఉండటం కూడా కలిసొచ్చే అంశం.

జయవర్దనే కోచ్‌గా ఉన్న సమయంలోనే
జయవర్దనే కోచ్‌గా ఉన్న సమయంలోనే ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ జట్టుని అద్భుతంగా నడిపించి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించడంతో పాటు రెండు సార్లు విజేతగా నిలబెట్టాడు. ఈ ముగ్గురి సారథ్యంలో టీమిండియా వచ్చే వరల్డ్‌కప్ సమయానికి బలమైన జట్టుగా అవతరిస్తుందనడంలో ఎలాంటి సందేహాం లేదు. జయవర్దనేతో పాటు టీమిండియా హెడ్ కోచ్ పదవి రేసులో గ్యారీ కిరెస్టన్, టామ్ మూడీలు కూడా ఉన్నారు.

ముంబై ఇండియన్స్‌ను రెండు సార్లు
శ్రీలంక తరుపున 652 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన జయవర్దనే 25,957 పరుగులు చేశాడు. అందులో 54 సెంచరీలు, 136 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకి హెడ్ కోచ్‌గా ఉన్నారు. ఐపీఎల్ పది, పన్నెండు సీజన్లలో ముంబై ఇండియన్స్ టైటిల్ విజేతగా అవతరించడంతో జయవర్దనే కీలకపాత్ర పోషించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications