
ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు టైటిల్ ఒడిసిపట్టాలని, ఇంకేం చూడను కూడా చూడొద్దని శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే టీంకు చెప్పాడు. 2022ఆసియాకప్‌లో తమ మొదటి మ్యాచ్‌లో ఓటమిని చవిచూసిన శ్రీలంక.. తర్వాత గొప్పగా పుంజుకుని పోరాట పటిమ కనబర్చింది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టును ఓడించి కప్‌ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉండగా.. రాబోయే టీ20 ప్రపంచకప్ మెగా ఈవెంట్‌లో శ్రీలంక నిర్భయ బ్రాండ్ క్రికెట్‌ని ఆడాలని, ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకోవడానికి ప్రయత్నించాలని జయవర్ధనే పేర్కొన్నాడు.
'గత టీ20 ప్రపంచకప్‌లో, అలాగే ఇప్పుడు ఆసియా కప్‌లో వారు సాధించిన ఫలితాన్ని వారి ఆత్మవిశ్వాసాన్ని చూసుకుంటే.. అన్ని విధాలుగా శ్రీలకం టీం ప్రపంచకప్‌ను గెలుచుకోవడం తప్ప మరేమీ చూడకూడదని నేను భావిస్తున్నాను. అని జయవర్ధనే చెప్పాడు. 'నా ఉద్దేశ్యం వారు ఇదే ఆత్మవిశ్వాస వైఖరిని కలిగి ఉండాలి.
ఎలాంటి భయం లేకుండా ఆడతారని, టీ20 ప్రపంచకప్ అనే ఫీలింగ్‌తో ఎక్స్‌ట్రా లగేజీ మైండ్లో పెట్టుకోకుండా ఫ్రీగా ఆడతారని నేను భావిస్తున్నాను. ఆస్ట్రేలియాకు వెళ్లి మంచి క్రికెట్‌ను ఆస్వాదించండి. ఫియర్‌లెస్‌గా ఆడండి' అని జయవర్ధనే చెప్పాడు. ఆస్ట్రేలియాలోని పరిస్థితులకు శ్రీలంక ఎలా అలవాటు పడుతుందనే దానిపై కూడా ఫలితం ఆధారపడి ఉంటుందని జయవర్ధనే అన్నాడు.
'టీ20 ప్రపంచకప్ ప్రారంభం శ్రీలంకకు చాలా కీలకమైంది. ఎందుకంటే జట్టు వేగంగా అక్కడి పరిస్థితులకు సర్దుబాటు చేసుకోవాలి. నా ఉద్దేశం ప్రకారం.. జట్టు సభ్యులు ఆ విషయాన్ని చాలా సమర్థంగా చేయగలరని నేను చాలా నమ్మకంగా ఉన్నాను' అని జయవర్ధనే అన్నాడు. ఇకపోతే ఆసియా కప్ విషయానికొస్తే.. శ్రీలంక గ్రూప్ స్టేజులో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఓడిపోయింది. అయితే సూపర్ ఫోర్ దశలోకి ప్రవేశించడానికి తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆ జట్టు బంగ్లాదేశ్‌ను ఓడించింది. సూపర్ ఫోర్ మ్యాచ్‌లలో.. ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, పాకిస్తాన్‌లను సైతం ఓడించింది. ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను మళ్లీ ఓడించి ఆరోసారి ఆసియా కప్ టైటిల్‌ను లంక కైవసం చేసుకుంది.