Mahela Jayawardene: టిమ్ డేవిడ్ అంత మంచిగా ఆడతాడనుకోలే.. ముందే తెలిసుంటేనా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో ఆడిన 13మ్యాచ్‌లలో కేవలం మూడు విజయాలతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంది. ముంబైకి ఇది ఓ చేదు సీజన్. ఇకపోతే ముంబై ఈ సీజన్లో తన చివరి మ్యాచ్ శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి తమ సీజన్‌ను కాస్త గౌరవప్రదంగా ముగించాలని చూస్తుంది. ఇక ముంబై ఈ సీజన్లో పేలవంగా ఆడినప్పటికీ కొందరు మంచి ప్లేయర్లు టీంలో వెలుగుచూశారు. అందులో టిమ్ డేవిడ్ ఒకడు. డేవిడ్ ఆడిన ఏడు మ్యాచ్‌లలో 152పరుగులు చేశాడు. అది కూడా లోయర్ ఆర్డర్లో దిగి ఆ పరుగులు చేయడం గమనించదగ్గది. అలాగే ఒకట్రెండు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కూడా ఆడాడు. తద్వారా ఈ సీజన్లో ముంబై ఫ్రాంచైజీకి దొరికిన ఓ మంచి ప్లేయర్‌గా పేర్కొనబడ్డాడు. ఇకపోతే ముంబై ప్రధాన కోచ్ మహేలా జయవర్ధనే శుక్రవారం మాట్లాడుతూ... టిమ్ డేవిడ్ ఈ సీజన్ మొదట్లో కొంచెం అంతంతమాత్రంగా కన్పించాడు. కానీ సీజన్ ముగింపు టైంలో అతనిలో ఎంత క్వాలిటీ ఉందో చూపించాడని పేర్కొన్నాడు.
టిమ్ డేవిడ్‌ను తొలి మ్యాచ్‌లలో ఆడించే విషయం గురించి వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జయవర్ధనే మాట్లాడుతూ.. గత 12 నెలల్లో అతని ఆటను మేం గమనించాం. అతనిలో చాలా ప్రతిభ ఉందని మేము భావించాం. అతను చాలా టోర్నీల్లో రాణించాడు. అయితే ఐపీఎల్ మిగతా టోర్నీలతో పోలిస్తే చాలా డిఫరెంట్. అందుకే అతన్ని తొలినాళ్లలో ఆడించడానికి కాస్త సంకోచించాం. కానీ అతను ఆడగలడని అనుకున్నాం కానీ అవకాశాలు అనుకోకుండా ఇవ్వలేకపోయాం. కానీ అవకాశాలిచ్చగా.. అతను ఏమి చేయగలడో చూపించాడు. అతను మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడగలడు. చివర్లో రాణించడానికి అతను బాగా అలవాటు పడుతున్నాడు అని జయవర్ధనే పేర్కొన్నాడు.
'కీరన్ పొలార్డ్ నిరాశజనకమైన ప్రదర్శన మమ్మల్ని కొంచె నిరుత్సాహపరిచింది. ముంబై జట్టులో చాలా కాలంగా పొలార్డ్ ఆడుతున్నాడు. ఇకపోతే మేము తర్వాతి సీజన్ కోసం మా జట్టును ఎలా సెటప్ చేయాలో ఆలోచిస్తున్నాం. మేము ఈ సీజన్ తర్వాత కూర్చుని అన్ని రకాల పరిశీలన జరుపుతాం. మా జట్టులో నాణ్యత కలిగి ఉన్న క్రికెటర్లు ఉన్నారు. నిజాయితీగా చెప్పాలంటే.. మేము మంచి క్రికెట్ ఆడలేదు. జట్టు ప్రదర్శన పట్ల కచ్చితంగా నిరాశ చెందాం. అయినా జట్టులో యువకులు రాణించడం సానుకూలాంశం. మేం జట్టు ప్రదర్శన మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తాం' అని జయవర్ధనే తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications