లంక గెలిచిందోచ్..

హైదరాబాద్: లంక జట్టు చాలా కాలం తర్వాత గెలుపు రుచి చూసింది. ముక్కోణపు వన్డే టోర్నీలో శ్రీలంక విజేతగా నిలిచింది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తుది పోరులో లంక 79 పరుగులతో గెలుపొందింది. ఈ సమరంలో సర్ షెహాన్ మడుశంక (3/26) అరంగేట్రంలోనే హ్యాట్రిక్‌తో అదరగొట్టాడు. మొదట బ్యాటింగ్ చేసిన లంకేయులు 50 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటయ్యారు.
రుబెల్ హుస్సేన్ (4/46) ప్రత్యర్థిని కట్టడి చేశాడు. ఛేదనలో మడుశంక, ధనంజయ (2/30) ధాటికి బంగ్లా.. 41.1 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటైంది. మహ్మదుల్లా (76) టాప్ స్కోరర్. 40వ ఓవర్లో చివరి రెండు బంతులకు మొర్తజా, రుబెల్ హుస్సేన్‌లను ఔట్ చేసిన మడుశంక.. 42వ ఓవర్ తొలి బంతికి మహ్మదుల్లాను పెవిలియన్ చేర్చి హ్యాట్రిక్ సాధించాడు. ఇలా అరంగేట్రంలోనే హ్యాట్రిక్ సాధించిన నాలుగో బౌలర్‌గా మహ్మదుల్లా నిలిచాడు.
తరంగ (56), చండిమాల్ (45), డిక్‌వెలా (42) రాణించారు. బంగ్లా బౌలర్లలో రూబెల్ హుస్సేన్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాట్స్‌మెన్ సమష్టిగా విఫలమవడంతో బంగ్లా 41.1 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది. మహ్ముదుల్లా (76) పోరాడినా లాభం లేకపోయింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications