Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘సచిన్.. భారతరత్నను దుర్వినియోగం చేస్తున్నారు’

భోపాల్‌: దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'ను క్రికెట్ దిగ్జం సచిన్‌ టెండూల్కర్‌ దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను మధ్యప్రదేశ్‌ హైకోర్టు విచారణకు స్వీకరించింది.

వాణిజ్య ప్రకటన కోసం ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఉపయోగించడంపై సుప్రీం కోర్టు సూచనలు ఏమైనా ఉన్నాయా? అని పరిశీలించాలని అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఏఎమ్‌ కన్విల్కర్‌, జస్టిస్‌ కేకే త్రివేది ఆదేశించారు.

దేశ అత్యున్నత పురస్కారాన్ని పొందిన సచిన్ టెండూల్కర్‌.. వాణిజ్య ఉత్పత్తులకు ప్రచారం చేస్తున్నాడని భోపాల్‌కు చెందిన వీకే నష్వా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. అతనికి ఈ సౌకర్యం దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు.

Madhya Pradesh HC admits PIL against Sachin Tendulkar's Bharat Ratna

వాణిజ్య ప్రకటనలు చేయాలనుకుంటూ సచిన్ టెండూల్కరే ఈ అత్యున్నత పురస్కారాన్ని తిరిగివ్వాలని లేదా ప్రభుత్వమే అవార్డును వెనక్కి తీసుకోవాలని నష్వా కోరారు. అత్యున్నత పురస్కారం పొంది.. వాణిజ్య ఉత్పత్తులకు ప్రచారం చేయడం సరైంది కాదని సూచించారు.

కాగా, సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం అవివై లైఫ్ ఇన్స్యూరెన్స్, బూస్ట్, ఎమ్మార్ఎఫ్, ల్యూమినస్, అమిత్ ఎంటర్‌ప్రైజెస్ లతోపాటు మరో డజనుకు పైగా వాణిజ్య కంపెనీలకు ప్రచారకర్తగా ఉన్నారు. నిరుడు నవంబర్‌లోనే క్రికెట్ నుంచి రిటైరైనప్పటికీ.. సచిన్‌ను తమ ఉత్పత్తులకు ప్రచారకర్త చేసుకోవాలని అనేక కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+