Ranji Trophy Final: అప్పట్లో కెప్టెన్‌గా టైటిల్ మిస్సయినా.. ఇప్పుడు కోచ్‌గా సాధించిన చంద్రకాంత్ పండిట్

భారత దేశవాళీ క్రికెట్లో పేరెన్నికదగ్గ టోర్నమెంట్‌గా రంజీ ట్రోఫీకి పేరుంది. ఇక ఈ రంజీ టోర్నమెంట్లో ముంబై జట్టు ఇప్పటివరకు 41సార్లు విజేతగా నిలిచి ఈ టోర్నీలో ఆల్ టైం ఫేవరెట్ జట్టుగా తన పేరు లిఖించుకుంది. ఇక ఆ జట్టు మొత్తంగా 46సార్లు ఫైనల్ చేరింది. మరోవైపు మధ్యప్రదేశ్ జట్టు మాత్రం ఒక్కసారి కూడా రంజీ టైటిల్ గెలవలేదు. ఇక 23ఏళ్ల క్రితం 1999లో ఒక్కసారి ఆ జట్టు ఫైనల్ చేరింది. అప్పట్లో ఆ జట్టుకు కెప్టెన్‌గా చంద్రకాంత్ పండిట్ వ్యవహరించాడు. అప్పట్లో ఫైనల్లో మధ్యప్రదేశ్ ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.
భుజాలపై ఎత్తుకున్న ప్లేయర్లు
ఇక ప్రస్తుతం మధ్యప్రదేశ్ కోచ్‌గా చంద్రకాంత్ పండిట్ వ్యవహరిస్తుండగా.. ఆ జట్టు 72ఏళ్ల తర్వాత తొలిసారి రంజీ ట్రోఫీ గెలిచింది. ఇక అప్పట్లో కెప్టెన్‌గా తాను టైటిల్ జట్టుకు అందించలేకపోయినా.. ప్రస్తుతం కోచ్‌గా తన కల నెరవేరిందని చంద్రకాంత్ పండిట్ భావోద్వేగానికి లోనయ్యాడు. గ్రౌండ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఏడ్చేశాడు. ఇక అతన్ని ఆలింగనం చేసుకున్న మధ్యప్రదేశ్ జట్టు ప్లేయర్లు.. తమ భుజాలపై ఎక్కించుకుని గ్రౌండ్లో తింపి ఖుషీ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
చివరి రోజులు లక్ష్యాన్ని ఛేదించి..
ఇకపోతే రంజీ ట్రోఫీ 2021 - 22లో ముంబై వర్సెస్ మధ్యప్రదేశ్ జట్లు ఫైనల్లో తలపడగా.. చివరి ఇన్నింగ్స్ చివరి రోజు ముంబై విధించిన 108పరుగుల లక్ష్యాన్ని మధ్యప్రదేశ్ 4వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదింది 6వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా రంజీట్రోఫీ చరిత్రలో తొలిసారి టైటిల్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా మధ్యప్రదేశ్ ప్లేయర్ శుభమ్ శర్మ నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ నిలిచాడు.
కోచ్‌గా సక్సెస్‌ఫుల్
ఇకపోతే మధ్యప్రదేశ్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన చంద్రకాంత్ పండిట్ సక్సెస్ ఫుల్ కోచ్ కూడా. అతనికి కోచ్‌గా ఇది ఆరో రంజీ ట్రోఫీ విజయం. అంతకుముందు అతను 2002- 2003, 2003 - 2004, 2015 - 2016 సీజన్లలో ముంబైకి కోచ్‌గా వ్యవహరించగా.. ఆ జట్టు టైటిళ్లు గెలుపొందింది. ఇక 2017 -18, 2018 -19లో విధర్భ జట్టుకు కోచ్‌గా వ్యవహరించగా అప్పుడు ఆ జట్టు టైటిళ్లు గెలుపొందింది. తాజాగా 2021 - 22 సీజన్లో మధ్యప్రదేశ్‌కు కోచ్‌గా వ్యవహరించగా ఇప్పుడు ఎంపీ కూడా టైటిల్ గెలుపొందింది.
ముగ్గురు సెంచరీలు చేయడంతో..
ఇకపోతే తాజా ఫైనల్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ బ్యాటర్లలో యష్ దూబే (133), శుభమ్ శర్మ (116), రజత్ పాటిదార్ (122) సెంచరీలతో రాణించడంతో 536పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. దీంతో మధ్యప్రదేశ్‌కు 162పరుగుల మంచి లీడ్ దక్కింది. ఇక రంజీ ట్రోఫీ నిబంధనల ప్రకారం.. ఒకవేళ మ్యాచ్ డ్రా అయినా.. తొలి ఇన్నింగ్స్‌లో లీడ్ సాధించిన జట్టే విజేతగా నిలుస్తుంది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసేసరికి మధ్యప్రదేశ్ విజయం దాదాపు ఖాయమైంది. అయినా ముంబై రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడి 269పరుగులు చేసి 107పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఇక మధ్య ప్రదేశ్ బ్యాటర్లలో హిమాన్షు మంత్రి (37), శుభమ్ శర్మ (30), రజత్ పాటిదార్ (30) రాణించడంతో మధ్యప్రదేశ్ గెలుపొంది తొలిసారి రంజీ ట్రోఫీ ముద్దాడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications