Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓవర్ నైట్ స్టార్- పంజాబ్ కింగ్స్ ను మట్టికరిపించాడు

ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచడంలో యంగ్ ఆల్ రౌండర్ మాధవ్ తివారీ కీలక పాత్ర పోషించాడు. తన సీనియర్ ప్రొఫెషనల్ కెరీర్‌లో రెండో మ్యాచ్ ఆడుతున్న ఈ స్పీడ్ స్టర్ బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతంగా రాణించాడు. అతని ఈ ఆల్ రౌండ్ షోకు తొలి ఐపీఎల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అటు ఢిల్లీ కూడా ప్లేఆఫ్స్ రేసు ఆశలను సజీవంగా ఉంచుకోగలిగింది.

ధర్మశాలలో సోమవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన తివారీ ఢిల్లీని గెలుపుబాట పట్టించాడు. 8 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ తో 18 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇంకా ఓ ఓవర్ మిగిలి ఉండగానే భారీ స్కోర్ ను కొట్టి అవతలపడేసింది ఢిల్లీ కేపిటల్స్. మూడు వికెట్ల తేడాతో ఢిల్లీ విజయాన్ని అందుకుంది.

Madhav Tiwari Young All-Rounder Destroys Punjab Kings with Bowling and a Rapid Inning Proves Mettle

తొలుత బంతితోనూ మెరుపులు మెరిపించాడు మాధవ్ తివారీ. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యను విజృంభణకు అడ్డుకట్ట వేశాడు. ఆ తర్వాత కూపర్ కానోలీని పెవిలియన్ చేర్చాడు. 4 ఓవర్లలో 40 పరుగులు సమర్పించినా ఈ రెండు కీలక వికెట్లు ప్రత్యర్థి జట్టు ధాటిని కట్టడి చేశాయి.

ఎవరీ మాధవ్ తివారీ?

మాధవ్ తివారీ ఒక 22 ఏళ్ల మధ్యప్రదేశ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్. ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ. 40 లక్షలకు కొనుగోలు చేసి, ఈ సీజన్‌కు కూడా అట్టిపెట్టుకుంది. గత సంవత్సరం ముంబై ఇండియన్స్‌పై అరంగేట్రం చేశాడు తివారీ. కిందటేడాది ధర్మశాలలో జరిగిన మ్యాచ్ అది. భారత్-పాకిస్తాన్ యుద్ధం వల్ల ఆ మ్యాచ్ రద్దయింది.

మధ్యప్రదేశ్ టీ20 లీగ్‌లో నిలకడగా రాణిస్తుెన్నాడు. అండర్-19, అండర్-23 స్థాయిల్లో మధ్యప్రదేశ్‌కు ఆడిన తివారీ, ఆ రాష్ట్ర లీగ్‌లో భోపాల్ లెపర్డ్స్ జట్టు సభ్యుడు కూడా. స్టేట్ టీ20 లీగ్ సెమీఫైనల్‌లో తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. రేవా జాగ్వార్స్‌పై 31 బంతుల్లో 65 పరుగులు చేశాడు. తన జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కోచ్ ఇయాన్ బెల్ అతని పవర్ హిట్టింగ్ సామర్థ్యంపై నమ్మకం ఉంచి, సహజంగా ఆడాలంటూ సలహా ఇచ్చాడని మాధవ్ వెల్లడించాడు. పరిస్థితులు తన చేతుల్లో లేనప్పుడు, ప్రతి ప్రాక్టీస్ సెషన్‌లోనూ మెరుగ్గా ఉండేందుకు ప్రయత్నిస్తానని వివరించాడు. టీమిండియా మాజీ పేసర్ మునాఫ్ పటేల్ గురువుగా అభివర్ణించాడు.

Story first published: Tuesday, May 12, 2026, 12:02 [IST]
Other articles published on May 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+