కోహ్లీ ఎందుకు తగ్గాలి?.. విమర్శకులపై మాజీ క్రికెటర్ ఫైర్

ముంబై: న్యూజిలాండ్ గడ్డపై దారుణంగా విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ క్రికెటర్, ప్రస్తుత క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) మెంబర్ మదన్‌లాల్ మద్దతుగా నిలిచాడు. కెప్టెన్‌గా కోహ్లీ తన దూకుడు తగ్గించాలన్న విమర్శకుల సూచనలను అతను కొట్టిపారేశాడు. ఆరంభంలో ప్రతీ ఒక్కరు కోహ్లీ దూకుడైన కెప్టెన్సీ ఇష్టపడ్డారనీ, వైఫల్యాలు ఎదురవ్వగానే కోహ్లీ మారాలని ఉచిత సలహాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆట పట్ల కోహ్లీ తన దృక్పథాన్ని ఏమాత్రం మార్చుకోవాల్సిన అవసరం లేదని ఈ సీఏసీ మెంబర్ చెప్పుకొచ్చాడు.

ఈ గడ్డం ఇలానే ఉంచితే ముద్దిస్తా!!

కోహ్లీ సాధారణ కెప్టెన్ కాదు..

కోహ్లీ సాధారణ కెప్టెన్ కాదు..

‘కోహ్లీ.. భారత క్రికెట్ సాధారణంగా తయారు చేసిన కెప్టెన్ కాదు. అతను సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ స్కూల్ నుంచి వచ్చినవాడే. ఈ ఇద్దరు ఇంటా బయటా.. గేమ్ పట్ల అప్రోచ్ అయ్యే విధానం ఒకటే. కివీస్ టూర్‌లో విఫలమైనంత మాత్రాన కోహ్లీ తన దూకుడును, ఆట పట్ల తన ధృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు.'అని మధన్ లాల్ చెప్పుకొచ్చాడు.

అప్పుడు అందరూ ఇష్టపడ్డారు కదా?

అప్పుడు అందరూ ఇష్టపడ్డారు కదా?

‘ప్రారంభంలో కోహ్లీ దూకుడైన కెప్టెన్సీని ప్రతీ ఒక్కరు ఇష్టపడ్డారు. ఇప్పుడేమో తన దూకుడు తగ్గించుకోవాలంటున్నారు. కానీ మైదానంలో అతను వ్యవహరించే తీరు నాకు నచ్చుతుంది. ఒకప్పుడు భారతీయులు నెమ్మదస్తులనేవారు. ఇప్పుడేమో దూకుడు గురించి ప్రశ్నిస్తున్నారు. అసలు దూకుడు‌గా ఎందుకు ఉన్నామో అడగండి. నేను మాత్రం కోహ్లీ దూకుడిని ఆస్వాదిస్తాను. అతనిలాంటి కెప్టెనే కావాలి "అని ఈ సీఏసీ మెంబర్ తెలిపాడు.

ఇప్పటికీ కోహ్లీనే నెంబర్ వన్..

ఇప్పటికీ కోహ్లీనే నెంబర్ వన్..

న్యూజిలాండ్ సిరీస్‌లో విఫలమైనంత మాత్రానా కోహ్లీ కోల్పోయింది ఏంలేదని మధన్ లాల్ అన్నాడు. ఇప్పటికీ అతనే నెంబర్ వన్ బ్యాట్స్‌మన్ అనే విషయాన్ని గుర్తించాలన్నాడు.

‘ప్రస్తుతం కోహ్లీ ఫామ్‌లో లేకపోవడంతో అతను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడని అంటున్నారు. న్యూజిలాండ్ సిరీస్ కోహ్లీ నుంచి ఏం తీసుకెళ్లలేదు. ఇప్పటికీ అతనే నెంబర్ వన్ బ్యాట్స్‌మన్. ఫామ్ కోల్పోవడం అనేది సర్వసాధారణమే. అత్యుత్తమ ఆటగాళ్లందరూ ఈ పరిస్థితులను ఎదుర్కున్నవారే.'అని లాల్ కోహ్లీని వెనకేసుకొచ్చాడు.

నువ్వేం క్రికెటర్‌రా అయ్యా? .. ఇంత దారుణమా? (వీడియో)

అది నా పని కాదు..

అది నా పని కాదు..

ఇక ధోనీ భవిష్యత్తుపై లాల్‌ను ప్రశ్నించగా.. అది తన పని కాదని, సెలెక్టర్లు చూసుకుంటారని సున్నితంగా తిరస్కరించాడు. ‘ధోనీని జట్టులోకి తీసుకోవడం అనేది సెలెక్టర్ల పని. వారేం ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు'అని తెలిపాడు. కోహ్లీ నిలకడలేమి ఫామ్‌తో, ధోనీ రీ ఎంట్రీపై తలెత్తిన ప్రశ్నలన్నీటికి ఒక్క కరోనా వైరసే సమాధానమిచ్చింది. ఈ మహమ్మారి దెబ్బకు టోర్నీలన్నీ రద్దవ్వగా.. ఐపీఎల్ వాయిదా పడింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, March 17, 2020, 15:04 [IST]
Other articles published on Mar 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X