
చెలరేగిన పీటర్సన్
ఓవర్ నైట్ స్కోర్ 101-2 తో బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికాకు నేడు మంచి ఆరంభం లభించింది. అప్పటికే 48 పరుగులతో క్రీజులో ఉన్న కీగన్ పీటర్సన్ మ్యాచ్ ప్రారంభం అయిన కాసేపటికే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెరీర్‌లో పీటర్సన్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం పీటర్సన్ దూకుడుగా ఆడుతూ సౌతాఫ్రికాను విజయం దిశగా నడిపించాడు. ఈ క్రమంలో డస్సెన్‌తో కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో మ్యాచ్ భారత్ చేతిలో నుంచి చేజారి పోయేలా కనిపించింది.
బ్రేక్ ఇచ్చిన శార్దూల్
ఈ క్రమంలో యువ బౌలర్ శార్దూల్ ఠాకూర్ పీటర్సన్, డసెన్ భాగస్వామ్యాన్ని విడదీసి టీమిండియాకు మంచి బ్రేక్ ఇచ్చాడు. అద్బుతమైన బంతితో 10 ఫోర్లతో 113 బంతుల్లో 82 పరుగులు చేసిన పీటర్సన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో భారత్‌కు మంచి బ్రేక్ లభించింది. అంతేకాకుండా సౌతాఫ్రికా ఒత్తిడిలోకి వెళ్లింది. ఆ తర్వాత 170 పరుగుల వద్ద శార్దూల్ మరోసారి భారత్‌కు బ్రేక్ ఇచ్చినట్టే కనిపించాడు. ఎల్బీలో ఔట్‌గా భారత ఆటగాళ్లుగా అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ భారత్ రివ్వూకు వెళ్లింది. అయితే రివ్యూలో బాల్ వికెట్లకు పైన వెళ్లింది. దీంతో అది అంపైర్ కాల్‌గా తేలింది. భారత్‌కు మరో వికెట్ దక్కే అవకాశం పోయింది.

భారత్ గెలవాలంటే
సౌతాఫ్రికా విజయానికి 42 పరగులు మాత్రమే కావాల్సి ఉండడంతో టీమిండియా గెలవడం కష్టమనే చెప్పుకోవాలి. పైగా ఆ జట్టుకు 7 వికెట్లు చేతిలో ఉన్నాయి. తొలి సెషన్‌లో భారత బౌలర్లంతా సరైన ప్లేసులో బంతులు వేసినప్పటికీ సఫారీలు పట్టుదలగా క్రీజులో నిలబడడంతో ఫలితం లేకపోయింది. దీంతో టీమిండియా గెలవాలంటే సెకండ్ సెషన్‌లో అద్బుతం జరగాల్సిందే. వెంట వెంటనే వికెట్లు తీస్తూ సౌతాఫ్రికా బ్యాటర్లపై ఒత్తిడి పెంచితే ఏమైనా ఫలితం ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












